కారులో ఎలుగుబంటి.. ప్రాణాలు కాపాడిన కుక్క! | Viral: Black Bear Gets Trapped Inside Teachers Parked car Destroys Dash Airbag | Sakshi
Sakshi News home page

కారులో ఎలుగుబంటి.. ప్రాణాలు కాపాడిన కుక్క!

Published Sun, Jun 6 2021 8:31 PM | Last Updated on Sun, Jun 6 2021 8:47 PM

Black bear gets trapped inside teachers parked car, destroys dash, airbag, radio - Sakshi

హ్యూస్టన్​ కౌంటీ: సాధారణంగా కార్​ను పార్కింగ్​ చేసే తొందరలో..  ఒక్కొసారి దాని డోర్​ని లాక్​చేయడం మరిచిపోవడం లేదా లాక్​ వేసిన కూడా సరిగ్గా పడక పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్ని ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి. అయితే, జార్జియాలోని హ్యూస్టన్​ కౌంటీలో ఒక మహిళకు ఇలాగే అనుకోని వింత సంఘటన ఎదురైంది.

వివరాలు.. హ్యూస్టన్​ కౌంటీకి చెందిన మేరీజేన్​ అనే మహిళ వార్నర్​ రాబిన్స్​ స్కూల్​లో ఆర్ట్​ టీచర్​గా పని చేస్తుంది. ఆ స్కూల్ గాట్టిన్​బర్గ్​లోని టెనస్సీలో ఉంది. ప్రతిరోజు కార్​లో అక్కడికి వెళ్లి క్లాస్​లు తీసుకొని రాత్రి వరకు తన గమ్యస్థలానికి చేరుకుంటుంది. అయితే, ఆ టీచర్​ ఉన్న అపార్ట్​మెంట్​ అడవికి దగ్గరగా ఉంటుంది. అక్కడ జన సంచారం కూడ తక్కువగా ఉంటుంది. అందుకే ఆమె రక్షణ కోసం ఒక కుక్కను కూడా పెంచుకుంటుంది.

ఈ క్రమంలో ఒకరోజు క్లాసులు పూర్తిచేసుకొని అర్ధరాత్రి హ్యూస్టన్​ కౌంటీకి చేరుకుంది. అయితే, ఆరోజు రాత్రి ఒక నల్లని ఎలుగు బంటి ఆమె కారు డోరును తెరిచి దానిలో ప్రవేశించింది. అంతటితో ఆగకుండా, సీట్లను , ఆక్సిజన్​ బెలూన్​ను చింపేసింది. కార్​లోపలి భాగాలను,  ఇతర వస్తువులను చిందర వందర చేసేసింది. పాపం.. కార్​లోపలికి వెళ్లిన ఎలుగు బంటికి , బయటకు వెళ్లటానికి డోర్​లు తెరుచుకోలేదు. దాంతో అలాగే కార్​లో ఉండిపోయింది. మేరీజేన్​ ప్రతిరోజులాగే ఉదయాన్నే 6 గంటలకు స్కూల్​కు వెళదామని కార్​ దగ్గరకు వెళ్లింది.

అయితే, తన పెంపుడు కుక్క .. కారును చూసి భయంతో వణికిపోతూ.. వింతగా అరవడాన్ని మేరీ గమనించింది. దీంతో , ఆమె కార్​ను పరీక్షించి చూసింది. మొదట కార్​లో ఏవరో వ్యక్తి ఉన్నట్లు భావించింది. కాస్త దగ్గరకు వెళ్లి చూడగానే ఆమె నోటి వెంట మాట రాలేదు. కార్​లో ఉంది మనిషికాదు... ఎలుగు బంటి అని షాక్​కు గురయ్యింది. వెంటనే.. అక్కడి పోలీసు అధికారులకు సమాచారం అందించింది.

కాసేపటికి వారు అక్కడికి చేరుకున్న పోలీసులు కార్​ దగ్గరకు వెళ్లి పెద్ద శబ్దాలు చేశారు. దీంతో కారు లోపల ఉన్న ఎలుగు బంటి అద్దాలను పగలకొట్టుకుని  అక్కడి నుంచి అడవిలోకి  పారిపోయింది. ఇప్పడు ఈ వీడియో సోషల్​ మీడియాలో తెగ వైరల్​గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ పాపం.. ఎలుగు బంటికి మీ కారులో తినడానికి ఏం దోరకలేదు’, ‘ ఇంకా నయ్యం మీపై దాడిచేయలేదు’, ‘ మీ అదృష్టం బావుంది ’ , ‘ మీ పెంపుడు కుక్కే మీ ప్రాణాలను కాపాడింది ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవల ఒక మహిళ తన ఇంటి గోడపై వచ్చిన ఒక ఎలుగు.. తన పెంపుడు కుక్కలపై  దాడి చేస్తుందని వట్టి చేతులతోనే ఎలుగుతో పోరాడిన  వీడియో వైరల్​గా మారిన సంగతి తెలిసిందే.

చదవండి: బ్రేవ్‌గర్ల్‌ వర్సెస్‌ బియర్‌ : ఎలుగుబంటికే ఎదురెళ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement