బీరు లారీ బోల్తా
వెల్దుర్తి పట్టణ సమీపంలోని ఎన్‌హెచ్–44పై తిక్కతాత గుడి సమీపంలోని వంతెనపై బీరు లారీ బోల్తా పడింది.
వెల్దుర్తి రూరల్: వెల్దుర్తి పట్టణ సమీపంలోని ఎన్‌హెచ్–44పై తిక్కతాత గుడి సమీపంలోని వంతెనపై బీరు లారీ బోల్తా పడింది. సంగారెడ్డి నుంచి అనంతపురం ప్రైవేటు ఏజెన్సీకి బీరు లోడు లారీ గురువారం రాత్రి బయలు దేరింది. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో వెల్దుర్తి సమీపంలో వంతెనను ఢీకొనడంతో బోల్తా పడింది. తాడిపత్రికి చెందిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బాక్స్‌ల్లో ఉన్న బీరు సీసాలు కొన్ని పగిలిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ తులసీ నాగ ప్రసాద్, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను మళ్లించారు. బోల్తా పడిన లారీని పక్కకు తొలగించారు. గాయపడిన డ్రైవర్‌ను 108లో ఆసుపత్రికి తరలించారు. డోన్ ఎక్సైజ్ సీఐ విజయ్‌కుమార్ సాయంత్రం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. లారీలోని బాక్స్‌లను మరో లారీలోకి మార్చి ప్రభుత్వ గోడౌన్‌కు తరలించారు.