హైవేలో ప్రయాణిస్తున్న వాహనంలోంచి 600 సెల్‌ఫోన్లు చోరీ అయిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.
600 సెల్ ఫోన్లు చోరీ
Published Thu, Mar 2 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
వెల్దుర్తి రూరల్ : హైవేలో ప్రయాణిస్తున్న వాహనంలోంచి 600 సెల్‌ఫోన్లు చోరీ అయిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ తులసీనాగప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు నుంచి నాగపూర్‌కు.. కొత్త వీడియోకాన్(కంపెనీ రేటు రూ. 803లు) సెల్‌ఫోన్లను తరలిస్తున్నారు. డ్రైవర్‌తో పాటు, క్లీనర్, ఎక్స్‌ట్రా డ్రైవర్ ఉన్నారు. వీరు వెల్దుర్తి మండలం చెరుకులపాడు క్రాస్ వద్ద లారీని పరిశీలించగా.. డోర్ సీల్ లేకపోవడం గమనించారు. డోర్ తెరిచి చూడగా అందులోని 15 బాక్సులు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో లాజిస్టిక్స్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ప్రతినిధులకు విషయం తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన సెల్‌ఫోన్ల విలువ రూ.5లక్షలు ఉంటుందని తెలిపారు.
Advertisement
Advertisement