ఆత్మకూరు మండలంలోని ఎస్‌ఎన్ తాండాలో బుధవారం ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది.
కర్నూలు(ఆత్మకూరు): ఆత్మకూరు మండలంలోని ఎస్‌ఎన్ తాండాలో బుధవారం ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. కాలేనాయక్ అనే వ్యక్తి పొలంలో పనులు చేసుకుంటుండగా ఎలుగుబంటి ఒక్కసారిగా దాడిచేసి చేతిపైన, ముఖంపైన తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన నాయక్‌ను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.