సాక్షి, సిటీబ్యూరో: సిటీ హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ మరో ఆపరేషన్ పూర్తి చేశారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ పరిధిలో జనావాసాల్లోకి చొచ్చుకు వచ్చి బీభత్సం సృష్టించిన ఎలుగుబంటిని శుక్రవారం బంధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను షఫత్ అలీ ఖాన్ ఫోన్ ద్వారా ‘సాక్షి’కి వివరించారు. చంద్రాపూర్ సమీపంలోని థర్మల్ పవర్ ప్రాజెక్టు సమీప అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయి వచ్చిన ఓ ఎలుగుబంటి ప్రాజెక్టు ఏ రియాలో ప్రవేశించింది.
జనావాసాల్లో తిరుగు తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిం ది. దానిని బంధించేందుకు చంద్రాపూర్ ఫారెస్ట్ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సంజయ్ థాక్రే గురువారం షఫత్ అలీ ఖాన్ సహాయం కోరుతూ ఫోన్ చేశారు. దీంతో ఆయన హుటాహుటిన చంద్రాపూర్ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆపరేషన్ ప్రారంభించి భల్లూకాన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మ రం చేశారు. ఆరు గంటల గాలింపు తర్వాత శుక్రవారం ప్రాజెక్టు ప్రాంగణంలోని పాత క్వార్టర్స్‌లోని పొదల్లో సేదదీరుతున్న భల్లూకాన్ని∙ట్రాంక్వలైజ్ చేసి బంధించి అడవిలో విడిచిపెట్టారు.