పెళ్లి వేడుకలో ఎలుగుబంటి.. జనం హడల్‌! | Bear Crashes Wedding Unfaged Guest Continues Eating Dinner | Sakshi
Sakshi News home page

పెళ్లి వేడుకలో ఎలుగుబంటి.. జనం హడల్‌!

Published Thu, Oct 28 2021 4:25 PM | Last Updated on Thu, Oct 28 2021 7:52 PM

Bear Crashes Wedding Unfaged Guest Continues Eating Dinner - Sakshi

మెక్సికో: వేడుకల్లో లేదా ఏదైనా ఉత్సవంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అది మనకు ఎప్పటి మర్చిపోని జ్ఞాపకంలా ఉంటుంది. పైగా ఆ ఘటనకు కారణమైన మనుష్యులను చూసినప్పుడు వెంటనే ఆ సంఘటన గుర్తకు వచ్చి నవ్వుతుంటాం. అచ్చం అలాంటి ఘటన మెక్సికో వివాహ వేడుకలో చేటుచేసుకుంది.

(చదవండి: రబ్బరు ష్యూస్‌ వల్లే బ్రతికాను)

వివరాల్లోకెళ్లితే.....మెక్సికోలోని వన్యప్రాణులు సంచరించే పర్వత ప్రాంతమైన న్యూవో లియోన్‌ వేడుడకగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత అతిథులంతా భోజనం చేసే రిసెప్షన్ హాలులో భోజనం చేస్తుండగా అనుకోని అతిథలా ఒక ఎలుగుబంటి పిల్ల వస్తుంది. దీంతో పెళ్లికి వచ్చిన జనంలో ఒకటే ఆందోళన. అయితే ఆ ఎలుగుబంటి పిల్ల మాత్రం అక్కడ ఉన్న ఆహారపదార్థాలను వాసన చూస్తూ అక్కడ ఉన్న టేబుల్‌పై ఉన్న వాటిన్నంటిని పడేస్తు దానికి కావలసిని ఆహారం కోసం వెతుకుతుంది.

కానీ అక్కడ ఉన్న ఒక అతిథి మాత్రం ఇది ఏమి పట్టనట్టు ఉంటాడు. ఆ తర్వాత కాసేపటికి తనదారిని తన నివాసానికి వెళ్లిపోతుంది. అయితే అదృష్టమేమిటంటే ఆ పెళ్లిలో అతిథులను ఎవర్నీ గాయపర్చలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్లు పెళ్లివేడుకల్లో ఉండే రకరకాల ఆహార పదార్థాల వాసనకు ఆగలేక వచ్చి ఉంటుందంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: కోవిడ్‌ పేరు చెప్పి రుణం తీసుకున్నాడు...కటకటాల పాలయ్యాడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement