ఏమైందో ఏమో ఒక్కసారిగా ఓ నది ఎరుపు రంగులోకి మారిపోయింది. ఈ షాకింగ్ ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఓరియన్ బ్రూవరీస్ అనే బీర్ ప్యాక్టరీ లీక్ కారణంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ షాకింగ్ ఘటన ఒకినావాలోని నాగో సిటీలోని ఓడరేవు వద్ద జరిగింది. కర్మాగారాన్ని చల్లబరిచే ప్రక్రియలో భాగంగా వినియోగించే ఒక రసాయనం కారణంగా ఇది జరిగిందని వివరణ ఇచ్చారు.
ఇది సురక్షితమైనదేనని, ఈ రసాయనాన్ని కాస్మెటిక్ పరిశ్రమలో వియోగిస్తారని చెప్పారు. సదరు ఓరియన్ బ్రూవరీ కంపెనీ ఫుడ్ కలరింగ్ రసాయనం వల్లే ఇది ఈ రంగులోకి మారిందని. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని తెలిపింది. తమ ఫ్యాక్టరీని చల్లబరిచే ప్రక్రియకు సంబంధించి ఆహార భద్రత చట్టాల నిబంధనలో జాబితాలో ఉందని వివరణ ఇచ్చింది. ప్రొపైలిన్ గ్లైకాల్ అనే రసాయంన లీకేజ్ కారణంగా ఇలా నది ఎరుపురంగులోకి మారిందని తెలిపింది.
నిజానికి లీకైన శీతలీకరణ నీరు వర్షం ద్వారా నదిలోకి ప్రవహించడంతో ఇలా మారిందని, అది కాస్త సముద్రంలోకి చేరడంతో ఓడరేవు ఈ రంగులోకి మారిందని వెల్లడించింది ఓరియన్ బ్రూవరీస్ బీర్ కంపెనీ. ఈ మేరకు బీర్ కంపెనీ ప్రెసిడెంట్ హజిమ్ మురానో మాట్లాడుతూ..ఈ అసౌకర్యానికి క్షమాపణలు చెప్పడమే గాక ఈ లీక్ ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Orion beer factory leak turns Japanese port red. pic.twitter.com/uyw3JC02S2
— Project TABS (@ProjectTabs) June 29, 2023
Comments
Please login to add a commentAdd a comment