► తుమ్మ చెట్టుపై ప్రత్యక్షం
► ఆందోళనకు గురైన ప్రజలు
► పట్టుకున్న అటవీ సిబ్బంది
గోవర్ధనగిరి(రఘునాథపల్లి) : ఎలుగుబంటి తుమ్మ చెట్టుపై ప్రత్యక్షమై కల కలం సృష్టించింది. ఈ సంఘటన వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిలో గోవర్దనగిరి బస్టాండ్ సమీపం లోగురువారంచోటుచేసుకుంది. దీంతో ప్రజలు మూడు గంటలపాటు ఆందోళనకు గురయ్యూరు. తెల్లవారుజామున బస్టాండ్ సమీపంలోని గర్వందుల లక్ష్మయ్య వ్యవసాయ భూమిలో సంచరిస్తోంది. లక్ష్మయ్య కొడుకు అనిల్ అటుైవె పు వెళ్తుండగా అతడి కంటపడిన ఎలుగుబంటి ఒక్కసారిగా తుమ్మచెట్టు ఎక్కింది.
సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో వారిని చూసి చిటారు కొమ్మ ల్లో నక్కింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై సత్యనారాయణ అక్కడికి చేరుకున్నారు. అటవీ శాఖ అధికారులకు విషయూన్ని వివరించారు. ఈ మేరకు ములుగు ఎఫ్ ఆర్‌ఓ కొండల్‌రెడ్డి, హన్మకొండ ఎఫ్‌ఆర్‌ఓ రాజారావు, వైద్యులు, రెస్క్యూ టీంతో అక్కడికి చేరుకున్నారు.
అటవీ శాఖ సిబ్బంది చెట్టుకింద వల అమర్చగా..వైద్యుడు ప్రవీణ్‌కుమార్ ఎయిర్ గన్‌తో ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. కొద్ది సేపటికి మత్తులో ఉన్న ఎలుగుబంటి వలలో పడింది. దానిని బోనులో బంధించి ప్రత్యేక వాహనం లో తాడ్వాయి అడవుల్లోకి తీసుకెళ్లి వది లేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలి పారు. దీంతోగ్రామస్తులుఊపిరి పీల్చుకున్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సదానందం, రెస్క్కూ టీం సిబ్బందిరవి, లాలునాయక్ ఉన్నారు.
ఎలుగుబంటి కలకలం
Published Fri, Apr 17 2015 3:25 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement
Advertisement