Hyderabad National Highway
-
షార్ట్ సర్క్యూట్‌తో ట్రావెల్స్ బస్సు దగ్ధం
లింగాలఘణపురం: వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల బైపాస్ రోడ్డుపై బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో బస్సులోని 26 మంది ప్రయాణికులు డ్రైవర్ అఫ్జల్ అహ్మద్ షేక్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగ్దల్పూర్ నుంచి ఆదివారం రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ బయలుదేరిన ఏసీ కోచ్ బస్సు మర్నాడు తెల్లవారు జామున 5.30 గంటలకు నెల్లుట్ల బైపాస్ సమీపానికి చేరుకుంది. అదే సమయంలో ఇంజన్‌లోనుంచి పొగతోపాటు వాసన రావడంతో డ్రైవర్‌కు అనుమానం వచ్చి రోడ్డు పక్కన ఆపి దిగి చూశాడు. పొగలు ఎక్కువ కావడంతో నీళ్లు పోసినా ఫలితం లేకపోవడంతో ప్రయాణికులను వెంటనే అప్రమత్తం చేసి కిందికి దింపాడు. కొద్ది నిమిషాల్లోనే బస్సు మొత్తానికి మంటలు వ్యాపించాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. కొంతమంది లగేజీ కూడా కాలిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ రఘుచందర్, ఎస్సై దేవేందర్ ఆధ్వర్యంలో ప్రయాణికులను మరో బస్సులో హైదరాబాద్‌కు తరలించారు. -
‘సీమ’ నుంచి రాజధానికి రహదారి
♦ నాలుగు, ఆరు మార్గాలుగా నిర్మించాలని సీఎం ఆదేశం ♦ కృష్ణపట్నం నుంచి తాడిపత్రి, గుత్తి మీదుగా నాలుగు లేన్ల రోడ్డు సాక్షి, విజయవాడ బ్యూరో: రాయలసీమలోని మూడు జిల్లాలను రాజధాని అమరావతికి కలుపుతూ నిర్మించబోయే రహదారిని నల్లమల అటవీప్రాంతం మీదుగా అనుసంధానం చేయాలని సీఎం చంద్రబాబు ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖ చేపట్టనున్న అభివృద్ధి పనులను సీఎం మంగళవారం తన కార్యాలయంలో సమీక్షించారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి వచ్చే రహదారులను నాలుగు లేన్లుగా నిర్మించి, అవి కలిసే చోటు నుంచి అరు లేన్ల రదారిగా అమరావతికి వరకు నిర్మించాలని ఆదేశించారు. అనంతపురం నుంచి అమరావతికి ఇప్పుడున్న 472 కిలోమీటర్ల మార్గాన్ని నేరుగా నిర్మిస్తే దాదాపు 86 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్పారు. అప్పుడు మొత్తం 386 కిలోమీటర్లు ఉండే ఈ మార్గంలో 25 కిలోమీటర్లు మేర అటవీ ప్రాంతం ఉంటుందని అన్నారు. ఈ రహదారి పూర్తయితే అనంతపురం నుంచి రాజధానికి కేవలం 5 గంటల్లో రావచ్చన్నారు. పారిశ్రామికవాడలు, పర్యాటకాభివృద్ధి కృష్ణపట్నం నుంచి రాపూరు, కడప, చిట్వేలి, తాడిపత్రి, గుత్తి మీదుగా నాలుగు లేన్ల రోడు ్డను నిర్మించి దాన్ని బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారికి అనుసంధానించాలని సీఎ ం చెప్పారు. ఇచ్ఛాపురం-తడ మధ్య ఏర్పాటు చేస్తున్న బీచ్ కారిడార్ అభివృద్ధి ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు. విజయవాడలోని రవాణా శాఖ కార్యాలయం దగ్గర ఉన్న 1.5 ఎకరాల ఆర్అండ్బీ స్థలంలో భారీ భవనాల నిర్మాణానికి సీఎం ఆమోదం తెలిపారు. కాగా రాజధానిలో 25 వేల చదరపు అడుగుల భూమి ఇస్తే భారీ భవంతిని ఉచితంగా నిర్మించి ఇస్తానని జనచైతన్య గ్రూపు ప్రతినిధి మాదల చైతన్య చెప్పారు. ఆయన సీఎంను కలిశారు. మాదల చైతన్య తన తల్లి శకుంతల పేరిట ఈ నిర్మాణానికి పూనుకున్నారని సీఎం అభినందించారు. -
ఎలుగుబంటి కలకలం
► తుమ్మ చెట్టుపై ప్రత్యక్షం ► ఆందోళనకు గురైన ప్రజలు ► పట్టుకున్న అటవీ సిబ్బంది గోవర్ధనగిరి(రఘునాథపల్లి) : ఎలుగుబంటి తుమ్మ చెట్టుపై ప్రత్యక్షమై కల కలం సృష్టించింది. ఈ సంఘటన వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిలో గోవర్దనగిరి బస్టాండ్ సమీపం లోగురువారంచోటుచేసుకుంది. దీంతో ప్రజలు మూడు గంటలపాటు ఆందోళనకు గురయ్యూరు. తెల్లవారుజామున బస్టాండ్ సమీపంలోని గర్వందుల లక్ష్మయ్య వ్యవసాయ భూమిలో సంచరిస్తోంది. లక్ష్మయ్య కొడుకు అనిల్ అటుైవె పు వెళ్తుండగా అతడి కంటపడిన ఎలుగుబంటి ఒక్కసారిగా తుమ్మచెట్టు ఎక్కింది. సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో వారిని చూసి చిటారు కొమ్మ ల్లో నక్కింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై సత్యనారాయణ అక్కడికి చేరుకున్నారు. అటవీ శాఖ అధికారులకు విషయూన్ని వివరించారు. ఈ మేరకు ములుగు ఎఫ్ ఆర్ఓ కొండల్‌రెడ్డి, హన్మకొండ ఎఫ్ఆర్ఓ రాజారావు, వైద్యులు, రెస్క్యూ టీంతో అక్కడికి చేరుకున్నారు. అటవీ శాఖ సిబ్బంది చెట్టుకింద వల అమర్చగా..వైద్యుడు ప్రవీణ్‌కుమార్ ఎయిర్ గన్‌తో ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. కొద్ది సేపటికి మత్తులో ఉన్న ఎలుగుబంటి వలలో పడింది. దానిని బోనులో బంధించి ప్రత్యేక వాహనం లో తాడ్వాయి అడవుల్లోకి తీసుకెళ్లి వది లేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలి పారు. దీంతోగ్రామస్తులుఊపిరి పీల్చుకున్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సదానందం, రెస్క్కూ టీం సిబ్బందిరవి, లాలునాయక్ ఉన్నారు.