వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ దేవాలయమైన నాంపల్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం గుట్టపై ఎలుగుబంటి హల్‌చల్ చేసింది.
వేములవాడ(కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ దేవాలయమైన నాంపల్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం గుట్టపై శుక్రవారం రాత్రి ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. నాంపల్లి గుట్టపై రాత్రి ఎలుగుబంటి సంచారం సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఎలుగుబంటి సంచారంతో ఆలయం వద్దకు వెళ్లాలంటే భక్తులు భయాందోళన చెందుతున్నారు. రాత్రి ఆలయం పక్కకు రావడంతో అక్కడ సెక్యూరిటీగా ఉన్న పోలీసులు పరుగుతీశారు. ఆలయం సమీపంలో ఎలుగుబంటి సంచారం చేయడంతో భక్తులు భయపడుతున్నారు.