వ్యవసాయ పొలంలో పనుల కోసం వెళ్లిన ఓ వ్యక్తిపై ఎలుగు బంటి దాడి చేసింది.
వ్యవసాయ పొలంలో పనుల కోసం వెళ్లిన ఓ వ్యక్తిపై ఎలుగు బంటి దాడి చేసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఉంకుటూరు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఉంకుటూరు గ్రామంలోని సింహాచలం అనే రైతు తెల్లవారు జామున తన పొలానికి వెళ్లాడు... దారిలో ఒక ఎలుగు అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇది గమనించిన సమీప పోలాల్లోని వ్యక్తులు ఎలుగు బంటిని తరిమి.. తీవ్రంగా గాయపడ్డ సింహాచంలాన్ని అసుపత్రికి తరలించారు.