
శ్రీకాకుళం, సాక్షి: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం లంకపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం పొలం పనులు వెళ్లి వస్తుండగా కూలీలపై కందిరీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. గాయపడిన మరో ఇద్దరిని హుటాహుటిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేసున్నారు.
చదవండి: నెల్లూరు జిల్లాలో పరువు హత్య
Comments
Please login to add a commentAdd a comment