honeybees
-
శ్రీకాకుళంలో విషాదం.. కందిరీగల దాడిలో ఇద్దరి మృతి
శ్రీకాకుళం, సాక్షి: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం లంకపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం పొలం పనులు వెళ్లి వస్తుండగా కూలీలపై కందిరీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. గాయపడిన మరో ఇద్దరిని హుటాహుటిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేసున్నారు.చదవండి: నెల్లూరు జిల్లాలో పరువు హత్య -
కరోనాను గుర్తించే పనిలో తేనెటీగలు
సాక్షి,న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పెను సంక్షోభాన్ని సృష్టించింది. కరోనా అంతానికి గ్లోబల్‌గా పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికి కచ్చితమైన పరిష్కారం లభించలేదు. ముఖ్యంగా వైరస్‌ను గుర్తించేందుకే ఎక్కువ సమయం పడుతోంది. దీంతో తొందరగా కరోనాను గుర్తించే పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నెదర్లాండ్స్ పరిశోధకులు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ లక్షణాలను పసిగట్టేలా తేనెటీగలకు శిక్షణనిస్తున్నారు. తేనెటీగలకు వాసన పసిగట్టే అసాధారణ గుణం ఉందని, అదే తమ రీసెర్చ్‌కు దోహదపడుతుందని చెబుతున్నారు. కరోనా నిర్దారణ పరీక్షలకు గంటలు లేదా రోజులు పట్టవచ్చు, కాని తేనెటీగల నుండి ప్రతిస్పందన వెంటనే ఉంటుంది. ఈ పద్ధతి చౌకగా కూడా ఉంటుంది. కోవిడ్ టెస్ట్ ఫలితాలకోసం వేచి ఉండే సమయం తగ్గనుందని భావిస్తున్నారు. అంతేకాదు పరీక్షలు కొరత ఉన్న దేశాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు. (కరోనా విలయం: డీఆర్డీవో డ్రగ్‌కు గ్రీన్ సిగ్నల్) నెదర్లాండ్స్ యూనివర్సిటీలో బయో వెటర్నరీ ల్యాబ్‌లో తెనేటీగల సామర్ధ్యంపై పరిశోధనలు చేస్తున్నారు. మొదట కోవిడ్ ఇన్ఫెక్షన్ శాంపిళ్లను వాసన వీటికి చూపుతారు. పువ్వుల్లో మకరందాన్నే ఆఘ్రాణించే రీతిలోనే ఇవి స్ట్రా లాంటి నాలుకలతో వాటి వాసన పీల్చుతాయని ఈ ప్రాజెక్టులో పాల్గొన్న వైరాలజీ ప్రొఫెసర్ విమ్ వాన్ డెర్ పోయెల్ చెప్పారు. ఆ తరువాత ‘రివార్డు’గా చక్కర కలిపిన నీటిని వీటికి ఇస్తామన్నారు. అయితే ఇన్ఫెక్షన్ సోకని శాంపిల్ ని చూపితే వీటికి ఈ రివార్డు ఉండదని తెలిపారు. కోవిడ్ నమూనాలను చూపినప్పుడు మాత్రం దీన్ని స్వీకరించేందుకు ఇష్టపడట. చక్కెర నీటిని తీసుకున్న తేనెటీగలు, ఈ నమూనాల శాంపిళ్లను అందించినపుడు నాలుకలను చాచవని చెప్పారు. తేనెటీగలను సేకరించేవారి నుంచి తాము వీటిని తీసుకువచ్చి ప్రత్యేక హార్నెసెస్ వంటి వాటిలో ఉంచుతామన్నారు. ఇలా వీటి వల్ల కోవిడ్ ఫలితాలను త్వరగా గుర్తించవచ్చునన్నారు. వీటి రెస్పాన్స్ తక్షణమే ఉంటుందన్నారు. ఇది చౌక అయిన పధ్దతి అని, టెస్టులు తక్కువగా జరిగే దేశాల్లో ఇది ప్రయోగాజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. (కళ్లు తెరవండి! లేదంటే 10 లక్షల మరణాలు: లాన్సెట్ హెచ్చరిక) అయితే దీనివల్ల పెద్దగా ఫలితం ఉండదని ఘెంట్ విశ్వవిద్యాలయంలో తేనెటీగలు, కీటకాలు, జంతు రోగనిరోధక శాస్త్రాన్ని అధ్యయనం చేసే ప్రొఫెసర్ డిర్క్ డీ గ్రాఫ్ తెలిపారు. సమీప భవిష్యత్తులో ఇలాంటివి పనికి రావని, కరోనా నిర్దారణ పరీక్షల కంటే కూడా ఇతర పనులకోసం వాటిని వినియోగించుకుంటానని వెల్లడించారు. క్లాసిక్ డయాగ్నస్టిక్ పరికరాలనే కోవిడ్ టెస్టులకు వినియోగించుకోవడం మంచిదన్నారు. 1990 ప్రాంతాల్లో అమెరికాలోని రక్షణ విభాగం ‘‘ఇన్సెక్ట్ స్నిఫింగ్" అనే సాంకేతికతను వాడిందని, పేలుడు పదార్థాలను, విషపదార్థాలను గుర్తించడానికి తేనెటీగలు, కందిరీగలను వినియోగించుకుందని ఆయన పేర్కొన్నారు. (కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే!) -
తేనెటీగలకూ ఓ రోజుంది!
తేనెటీగ.. చూపులకు చిన్నదే గానీ, అది చేసే పని చాలా చాలా పెద్దది. పూల మీద వాలుతూ మకరందాన్ని సేకరిస్తుంది. పనిలో పనిగా ఇందాక దాటి వచ్చిన పూలలోని పుప్పొడిని గ్రహించి ఇప్పుడు స్పృశిస్తున్న పూలకు అందిస్తూ జీవనం సాగిస్తుంది. ప్రకృతిలో ఇదొక అద్భుతం. పరపరాగ సంపర్కం అనాదిగా ఇలా సహజంగా జరిగిపోతూ వస్తోంది! ప్రపంచవ్యాప్తంగా 75% ఆహార పంటల దిగుబడులు పెరగాడానికి, నాణ్యత చేకూరడానికి ఎంతో కొంత మేరకైనా తేనెటీగలు, అడవి తేనెటీగలు, సీతాకోకచిలుకలు, తుమ్మెదలు.. ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఇవి లేకపోతే టమాటా, కోకో, కాఫీ, ఆపిల్, బాదం.. పంటలు/తోటలు తుడిచిపెట్టుకు పోయి ఉండేవట. ప్రాణప్రదమైన సేవలందించే తేనెటీగలకు రసాయనిక పురుగుమందులతోనే ముప్పొచ్చిపడింది. పారిశ్రామిక వ్యవసాయం తీవ్రస్థాయిలో జరిగే పాశ్చాత్య, ఐరోపా దేశాల్లో ఈ బెడద ఎక్కువగా ఉంది. చనిపోయిన తేనెటీగలు కుప్పలు తెప్పలుగా బయటపడుతుండడం శాస్త్రవేత్తలను కలవరపరుస్తోంది. మనకు తిండి కొరత ముంచుకు రాకుండా ఉండాలంటే తేనెటీగలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. ఇందుకోసం ఈ ఏడాది నుంచి మే 20వ తేదీన ప్రపంచ తేనెటీగల దినోత్సవం జరుపుకోవాలని పిలుపునిచ్చింది. వ్యవసాయ రసాయనాలు వాడటం మానేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాలని సూచించింది. కేవలం రైతులకే కాదు.. సమాజంలో ప్రతి ఒక్కరికీ తేనెటీగలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. వీటికి హానిచేసే పనులు మానుకోవాలి. ఇళ్ల దగ్గర తేనెటీగల కోసం పూల మొక్కలు పెంచాలని ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్.ఎ.ఓ.) డైరెక్టర్ జనరల్ జోస్ గ్రాజియానో డ సిల్వ సూచిస్తున్నారు. మే 20నే ఎందుకు? తేనెటీగల పెంపకానికి స్లొవేనియా దేశం పెట్టింది పేరు. తేనెటీగల పెంపకానికి పితామహుడిగా పేరుగాంచిన అంతోన్ జన ఆ దేశస్తుడే. బ్రెజ్నిక అనే నగరంలో ఆయన 1734లో మే 20న జన్మించారు. చిత్రకళ నేర్చుకోవడానికి కాలేజీలో చేరినప్పటికీ అంతోన్ మనసంతా తేనెటీగల మీదే ఉండేదట. నిజానికి ఆయన బాల్యమంతా తెనె పెట్టెల మధ్యనే గడచింది. వాళ్ల నాన్న తమ ఇంటి చుట్టూ 130 తేనె పెట్టలను ఏర్పాటు చేశారట. ఆ విధంగా తేనెటీగలపై అంతోన్కు గాఢమైన ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తే ఆయనను తేనెటీగల తొలి అధ్యాపకుడిగా, తొలి గ్రంథ రచయితగా చరిత్రలో నిలబెట్టాయి. తేనెటీగల పెట్టెలను పెయింటింగ్స్‌తో సృజనాత్మకంగా తీర్చిదిద్దడం అంతోన్ ప్రత్యేకత. ఆయన స్మ ృత్యర్థం మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. తేనెటీగలకు హాని కలిగించే పురుగుమందులను నిషేధించే చట్టం తేవడం ద్వారా స్లొవేకియా మిగతా దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది! -
తేనెతుట్టె స్ఫూర్తితో కాలుష్య నియంత్రణ
తేనెతుట్టెలో ఆరు భుజాలతో ఉండే చిన్న చిన్న రంధ్రాలను ఎప్పుడైనా చూశారా? ఎంతో చక్కగా ఒక పద్ధతిగా అమరి ఉంటాయి ఇవి. అచ్చం ఇలాంటి ఆకారం, నిర్మాణాలతో ఏదైనా పదార్థాన్ని తయారుచేయగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ.. నానో స్థాయిలో ఇలాంటివి నిర్మించడం ఇప్పటివరకూ సాధ్యం కాలేదు. సౌదీ అరేబియా యూనివర్శిటీ ఈ సమస్యను అధిగమిస్తూ.. కేవలం ఐదు నిమిషాల్లోనే తేనెతుట్టె ఆకారంతో కూడిన పలుచటి పొరను తయారు చేయడంలో విజయం సాధించింది. ఒక రకమైన ప్లాస్టిక్‌తో తయారైన ఈ పొరను కాలుష్యాన్ని పీల్చేసేందుకు వాడుకోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సుజానా నూన్స్ తెలిపారు. రంధ్రాలతో కూడి ఉండటం.. నిలకడ కలిగి ఉండటంతో పాటు విస్తృతమైన ఉపరితల వైశాల్యం కారణంగా ఈ రకమైన పొరలను కావలసిన కాలుష్య కణాలను ఫిల్టర్ చేసేలా డిజైన్ చేసుకోవచ్చునని, కణాలతోపాటు వైరస్‌లను కూడా తొలగించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. అంతేకాకుండా ఈ పొరలను కొన్ని రకాల చికిత్సల్లోనూ వాడుకునేందుకు అవకాశముందని చెప్పారు. -
డిజిటల్ ఫీవర్
అమితానందం సెలబ్రిటీలన్నా, వారి ఆటపాటలన్నా, వారి పర్సనల్ ఫొటోలు, వీడియోలన్నా అందరికీ పండుగే. వాళ్లకి కష్టమొస్తే అభిమానులు దుఃఖపడతారు. వాళ్లు పెళ్లి చేసుకుంటే వీళ్లు పండుగ చేసుకుంటారు. వాళ్ల బర్త్‌డేలు, జీవితంలోని ఇతర ముఖ్యమైన రోజులు అభిమానులందరికీ అతి ముఖ్యమైనవే. అమితాబ్ బచ్చన్ ఇష్టం లేనిదెవరికి? ఆయన భార్య జయాబచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు విశ్వసుందరి ఐశ్వర్యా బచ్చన్, మనవరాలు ఆరాధ్య బచ్చన్... టోటల్ ఫ్యామిలీ అంతా సెలబ్రిటీలే... వీళ్లందరూ కలసి ఒకచోట కనిపిస్తే.. అదీ ఏ సినిమా షూటింగ్‌లోనో కాకుండా... ప్రైవేట్‌గా ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా సందడి చేస్తూ కంటపడితే... అభిమానులకు పండుగే పండుగ కదా! అది వైరల్ కాక ఏమవుతుంది మరి! తేనెపొట్ట తేనెటీగలంటే మీకు ఇష్టమా? మీకేమైనా పిచ్చా? తేనె అంటే ఇష్టమే కానీ, తేనెటీగలెవరికయినా ఇష్టం ఉంటుందా? ఒకవేళ ఇష్టం ఉంటే మాత్రం వాటినేమైనా ముద్దుపెట్టుకుంటామా? అంటారా? అలా అయితే మీరు వెంటనే సైడ్ తీసుకోవలసిందే... ఎందుకంటే ఈ ఫొటోలో ఉన్న అమ్మడు ప్రకృతి ప్రేమికురాలు. ఓహియోకు చెందిన ఎమిలీ ముల్లర్ అనే ఈ ముప్ఫై ఏడేళ్ల ఆమెకు తేనెటీగలంటే వల్లమాలిన అభిమానం ఉండటం వల్ల ఎంతో ప్రేమగా తేనెటీగలను పెంచుకుంటోంది. ఇటీవల ఆమె నాలుగోసారి గర్భం ధరించడంతో ఫొటో షూట్ చేయించాలనుకున్నాడామె భర్త. అంతే! తాను ముద్దుగా పెంచుకుంటున్న 20,000 తేనెటీగలను పిలిచి, పొట్టమీదకి ఎక్కించుకుని మరీ ఫొటోలకు స్టిల్సిచ్చింది. టీన్ ఇన్ ఫిఫ్టీ జూహీచావ్లా... ఒకనాటి విశ్వసుందరి. 80ల చివరి నుంచి 90ల చివరి వరకు వెండితెరను ఏలిన అందాల తార. ఖయామత్ సే ఖయామత్ తక్, ఇష్క్ తదితర చిత్రాలలో నటించి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన తారాజువ్వ. ముద్దుగారే ముఖం, మిలమిలా మెరిసే కళ్లు, చురుక్కున గుచ్చినట్టుండే నవ్వు... ఆమె నటించిన చిత్రాలను ఒకసారి చూసిన వాళ్లే మళ్లీ మళ్లీ చూసి మరీ సూపర్ డూపర్ హిట్ చేసేవారు. చాలా రోజులుగా తెరమరుగున ఉన్న ఈ తార ఉన్నట్టుండి వార్తల్లోకెక్కింది. మొన్నీమధ్యే యాభయ్యవ పుట్టిన రోజు జరుపుకున్న ఈ సుందరిని చూసిన వారందరా వహ్వా అన్నారు. అప్పటికీ ఇప్పటికీ ఆట్టే తేడా ఏం కనిపించట్లేదన్నారు.అందరి కామెంట్లూ ఆనందంగా స్వీకరించిందామె. రిటర్న్ గిఫ్ట్‌గా తన బ్యూటీ సీక్రెట్స్ అందరితోనూ పంచుకుంది. ఆమె షేర్ చేసిన బ్యూటిప్పులు, ఆమె బర్త్‌డే ఫొటోలు వాట్సప్పుల్లో, ఫేస్బుక్లో వేలాది షేర్లు, లక్షలాది లైకులుగా హల్ చల్ చేస్తున్నాయి. అది నిజమైతే ఎంత బావుణ్ణు! ఒక బీద కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఒక తండ్రి, తల్లి, ముగ్గురు పిల్లలు. తం్రyì కి ఎప్పుడూ ఆరోగ్యం బాగోదు. ఒకరోజు తండ్రి చనిపోయాడు. మూడు రోజుల వరకు బంధువులు ఆహారం పంపించారు. తరువాత ఆకలితో భరించాల్సిన రోజులు వచ్చాయి. తల్లి కొన్ని రోజులు ఎలాగో అవస్థలు పడి పిల్లలకి ఆహారం పెట్టగలిగింది. కానీ తరువాత ఆహారం లేక ఆకలితో ఉండవలసి వచ్చింది. ఆకలితో ఉండటం వలన 8 సంవత్సరాల బాబుకి జ్వరం వచ్చింది. మంచంలో ఉన్నాడు. ఒకరోజు ఐదేళ్ల పాప వాళ్ళ అమ్మని అడిగింది‘‘అమ్మా!! అన్నయ్య ఎప్పుడు చచ్చిపోతాడు..?’’అప్పుడు అమ్మ, పాపని అడిగింది ‘‘ఎందుకు అలా అడుగుతున్నావు’’ అని.అమ్మాయి బాధతో సమాధానం చెప్పింది. ఆ సమాధానం విని అందరికీ అప్పుడు ఏడుపొచ్చింది..సమాధానం ఏంటంటే!... ‘‘అన్నయ్య చచ్చిపోతే మన ఇంటికి అన్నం వస్తుంది కదా...!’’ ప్రియమైన సోదర సోదరీ మణులారా! మన దగ్గర మిగిలి ఉన్న ఆహారాన్ని బీద ప్రజలకి ఇవ్వండి. వాళ్ళకి ఇవ్వటం మన బాధ్యత కూడా. అలా మన బాధ్యత నెరవేర్చుకుంటే పైన ఉన్న భగవంతుడు మన కష్టాలు తీరుస్తాడు.ఈ మెసేజ్ గత కొద్ది నెలలుగా వాట్సప్‌లో షేర్ అవుతూనే ఉంది. ఇప్పుడు పెళ్లి, ఇతర వేడుకల సందర్భంగా ఎక్కువగా వండి, మిగిలిపోయిన భోజనాన్ని తీసుకెళ్లి అనాథలకు పంచి పెట్టే స్వచ్ఛంద సేవకులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమకు దగ్గరలో ఉన్న కార్యకర్తల కాంటాక్ట్ నంబరు దగ్గర ఉంచుకుంటే... ఇలాంటి పిల్లలకు అన్నం పెట్టవచ్చు. -
కావ్య.. ఓ స్పెషల్ గాళ్!
పన్నెండేళ్ల వయసులో ఎవరైనా ఏమిచేస్తారు? సహజంగానే బడికిపోతారు. తోటి పిల్లలతో కాసేపు ఆడుకుంటారు. ఆలసిపోయాక అమ్మ ఒడిలో సేదదీరతారు. అయితే 12 ఏళ్ల కావ్య విఘ్నేశ్ మాత్రం ఇందుకు భిన్నం. తాను కేవలం ఆటపాటలకే పరిమితం కాలేదు. కాస్త ఖాళీ సమయం దొరికినా దానిని ఇతరులకు ఉపయోగపడేలా వినియోగిస్తోంది. ఇతరులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరికేలా చేస్తోంది. న్యూఢిల్లీ: ఇప్పటిదాకా మీరు చదివినదంతా నిజమే. ఆవాస ప్రాంతాల్లో సంచరించే తేనెటీగల సంరక్షణకు కంకణం కట్టుకున్న కావ్య.. ఇందుకోసం ఏకంగా ఓ రోబోను తయారుచేసే పనిలో నిమగ్నమైంది. దీనిని వచ్చే నెలలో డెన్మార్క్‌లో జరగనున్న అంతర్జాతీయ రోబోటిక్స్ ప్రదర్శనలో ఉంచనుంది. దేశరాజధానిలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో నివసించే కావ్య... ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. రోబోటిక్స్, అత్యాధునిక పరికరాలను ఉపయోగించి ‘బీ సేవర్ బాట్’ను కావ్య తయారుచేసింది. ఈ ‘బీ సేవర్ బాట్’ ... ఫలదీకరణతోపాటు తేనె ఉత్పత్తికి దోహదం చేసే తేనెటీగలకు ఎటువంటి హాని కలగకుండా రక్షణ కల్పిస్తుంది. ‘తొమ్మిదేళ్ల వయసులోనే రోబోటిక్స్‌పై దృష్టి సారించా. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు రోబోటిక్స్ద్వారా పరిష్కార మార్గం చూపాలనేదే నా లక్ష్యమ’ని ఈ సందర్భంగా కావ్య చెప్పింది. గత మూడేళ్ల కాలంలో ఢిల్లీ రీజనల్ రోబోటిక్స్ చాంపియన్‌షిప్ (2015, 16)తోపాటు అనేక రోబోటిక్ చాంపియన్‌షిప్‌లను ఈ విద్యార్థిని కైవసం చేసుకుంది. వచ్చే నెలలో డెన్మార్క్‌లో జరిగే అంతర్జాతీయ పోటీలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తేనెటీగలపైనే ఎందుకు దృష్టి సారించావని అడగ్గా ‘సహజంగానే వీటిని ఎవరూ పట్టించుకోరు. పైగా రసాయనాలను వెదజల్లి మరీ మనుషులు వీటి ప్రాణాలను హరిస్తారు. ప్రపంచంలోని పంటల్లో 85 శాతం ఫలదీకరణ ప్రక్రియ వీటిద్వారానే జరుగుతుందనే విషయాన్ని నేను, నా బృందం తెలుసుకున్నామ’ని తెలిపింది. సాధారణంగా ఇళ్ల సమీపంలో తేనెతుట్టె కనిపిస్తే వెంటనే పెస్ట్ కంట్రోలర్లను రప్పించి వాటిపై రసాయనాలు చల్లిస్తారని, ఇలా చేయడం వల్ల 20 నుంచి 80 వేల వరకు తేనెటీగలు చనిపోతున్నాయని ఈ బాలమేధావి వివరించింది.