
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామశేషు దారుణ హత్యకు గురయ్యాడు. నడిరోడ్డుపై రక్తపు మడుగులో మృతదేహం పడిపోయి ఉండటం స్థానికంగా కలకలం సృష్టించింది.
వివరాల ప్రకారం.. గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామశేషు స్థానికంగా పలు వ్యాపారాలు చేస్తున్నారు. గతంలో ఈ గ్రామంలో మూడు దఫాలు సర్పంచ్‌గా కూడా పనిచేశారు. అయితే, పలు వ్యాపారాలు చేస్తున్న క్రమంలో కొందరు వ్యక్తులు ఆరేళ్ల క్రితం కూడా రామశేషుపై దాడి చేశారు. ఆ సమయంలో తీవ్ర గాయాలు కాగా కోలుకున్నారు. అయితే, మంగళవారం ఉదయం తన గోడౌన్‌కు స్టాక్ వచ్చిందని ఫోన్ రావడంతో రామశేషు అక్కడికి బయలుదేరారు.
ఈ క్రమంలో రోడ్డు మీద కాపుకాసిన గుర్తు తెలియని వ్యక్తులు అతడిని దారుణంగా హత్య చేశారు. తలపై బండిరాయితో కొట్టడంతో రక్తపు మడుగులో అక్కడికక్కమే మృతిచెందాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment