అనంతగిరి(విశాఖపట్నం జిల్లా): అనంతగిరి మండలం కోనాపురం పంచాయతీ చితలంగి గ్రామంలో సోమవారం తెల్లవారు జామున బహిర్భూమికి వెళ్తున్న రఘు(55) అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడిచేసింది. ఈ ఘటనలో రఘు తలకు, కంటికి తీవ్రగాయాలయ్యాయి. రఘును 108లో అరకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.