
తిరుమలగిరిలో చెట్ల పొదల్లో దాక్కున్న ఎలుగు బంటి
తిరుమలగిరి (తుంగతుర్తి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని తిరుమలహిల్స్ సమీపంలోని మామిడి తోటలో మంగళవారం ఉదయం ఎలుగుబంటి హడలెత్తించింది. తోటలో ఎలుగుబంటిని గమనించిన స్థానికులు ఆందోళనతో పోలీసులు, అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ ఖదీర్, బీట్ ఆఫీసర్ అచ్చయ్యలు తోట వద్దకు వచ్చి ఎలుగుబంటి సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు.
దాన్ని తరలించేందుకు జూపార్కు నుంచి సిబ్బంది వస్తున్నట్లు తెలిపినా.. సాయంత్రం వరకు ఎవరూ రాలేదు. మరోవైపు ఎలుగుబంటి తోటలో దూరంగా వెళ్లిపోయింది. జూపార్కు నుంచి ఎవరూ రాకపోవడంతో.. అటవీ శాఖ అధికారులు కూడా వెనుదిరిగారు. దీంతో ఎలుగుబంటి ఎప్పుడు వచ్చి ఎవరిపై దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment