కుప్పం (చిత్తూరు) : చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుడ్లనాయినిపల్లె గ్రామంలో శనివారం ఓ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో పశువులను కాస్తున్న వ్యక్తిపై దాడి చేసింది. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన తోటి పశువుల కాపరులు తమ ప్రాణాలు రక్షించుకొని అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.