కుప్పంలో టీడీపీ నేతల ఓవరాక్షన్ | TDP Leaders Tried To Attack On MLC Bharat At Kuppam | Sakshi
Sakshi News home page

కుప్పంలో టీడీపీ నేతల ఓవరాక్షన్.. ఎమ్మెల్సీ భరత్‌పై దాడికి యత్నం

Aug 1 2024 7:04 PM | Updated on Aug 1 2024 8:20 PM

TDP Leaders Tried To Attack On MLC Bharat At Kuppam

సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం  నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. రామకుప్పంలో ఎంపీటీసీల సమావేశానికి వెళ్లిన ఎమ్మెల్సీ భరత్‌పై దాడికి యత్నించారు. వైఎస్సార్‌సీపీ నేత, రామకుప్పం ఎంపీపీ చంద్రా రెడ్డి ఇంట్లో ఎంపీటీసీలతో ఎమ్మెల్సీ భరత్ హాజరయ్యారు. 

ఈ క్రమంలో ఎంపీపీ ఇంట్లోకి తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యంగా ప్రవేశించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలపై దురుసుగా ప్రవర్తించారు. వైఎస్సార్‌సీపీ నేతలు వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. ఎంపీపీ ఇంటికి చేరుకున్న పోలీసులు టీడీపీ నేతలను అక్కడి నుంచి పంపించేశారు.

Advertisement
 
Advertisement
Advertisement