మూడో ఎలుగుబంటి మృతి
Published Wed, Oct 5 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
వీణవంక : మండలంలోని శ్రీరాములపేటలో ఈనెల 2న కురిమిడ్ల కనకయ్య వ్యవసాయ బావిలోపడిన మూడో ఎలుగుబంటి కూడా మృతిచెందింది. తల్లి ఎలుగుబంటితోపాటు రెండు పిల్ల ఎలుగుబంట్లు బావిలో పడిన విషయం తెల్సిందే. ఈ సంఘటనలో తల్లితోపాటు ఓ పిల్లమంగళవారం మృతిచెందాయి. మిగిలిన మరో పిల్ల ఎలుగుబంటికోసం అటవీ శాఖ అధికారులు, గ్రామస్తులు బావిలో గాలించినా ఆచూకీ దొరకలేదు. బావిలో నిచ్చెన వేయడంతో పారిపోయిందనుకున్నారు. బుధవారం బావిలో చనిపోయి కనిపించింది. విషయాన్ని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో శంకరపట్నం మండలం సెక్షన్ ఆఫీసర్ కనకయ్య, బీట్ ఆఫీసర్ వేణు సంఘటన స్థలానికి చేరుకుని ఎలుగుబంటిని బయటికి తీశారు. పశువైద్యులు రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. అటవీ శాఖ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఎలుగుబంట్లు బతికేవని గ్రామస్తులు ఆరోపించారు.
Advertisement
Advertisement