హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ పంచ్ పేరుతో దేశంలో తొలి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. రూ.21,000 చెల్లించి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో ప్రవేశపెట్టారు. డైనా ప్రో టెక్నాలజీతో 1.2 లీటర్ రెవొట్రాన్ ఇంజన్‌తో తయారైంది. పరిశ్రమలో తొలిసారిగా ఆధునిక ఏఎంటీతో ట్రాక్షన్ ప్రో మోడ్, బ్రేక్ స్వే కంట్రోల్ పొందుపరిచారు.
90 డిగ్రీల కోణంలో తెరుచుకునే డోర్లు, ఆర్16 డైమండ్ కట్ అలాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ రూఫ్ ఆప్షన్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీ, కార్నర్ సేఫ్టీ కంట్రోల్‌తో ఏబీఎస్, క్రూయిజ్ కంట్రోల్, టిల్ట్ స్టీరింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి హంగులు ఉన్నాయి. ఏడు రంగుల్లో లభిస్తుంది. పంచ్ అభివృద్ధికి 150 నమూనా కార్లను వాడారు. ఇవి 20 లక్షలకుపైగా కిలోమీటర్లు ప్రయాణించాయని కంపెనీ తెలిపింది. భారత్, యూకే, ఇటలీలోని డిజైన్ స్టూడియోలు ఈ కారు అభివృద్ధిలో పాలుపంచుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment