Tata Motors: Tata Punch Micro SUV Finally Breaks Cover - Sakshi
Sakshi News home page

అదిరిపోయే ఫీచర్స్‌తో విడుదలైన టాటా మైక్రో ఎస్‌యూవీ

Published Mon, Oct 4 2021 3:16 PM | Last Updated on Mon, Oct 4 2021 8:01 PM

Tata Punch Micro SUV Finally Breaks Cover: See Variants, Features - Sakshi

టాటా మోటార్స్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టాటా మైక్రో ఎస్‌యూవీ పంచ్ కారును సంస్థ నేడు(అక్టోబర్ 4) విడుదల చేసింది. ఇది ఆల్ఫా-ఎఆర్ సీ(ఎజిల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్) ఫ్లాట్ ఫారంపై ఆధారపడి పనిచేస్తుంది. టాటా మోటార్స్ కారులలో చాలా పాపులర్ మోడల్ ఆల్ట్రోజ్ తరహాలోనే దీనిని అభివృద్ధి చేశారు. ఆసక్తి గల కొనుగోలుదారులు టాటా మోటార్స్ డీలర్ షిప్లు లేదా కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో రూ.21,000 చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు. 

అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్
టాటా మోటార్స్ పంచ్ కోసం వర్చువల్ షోరూమ్ కూడా ప్రారంభించింది. మైక్రో ఎస్‌యూవీ పంచ్ కారు ధరలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. టాటా పంచ్ వేరియంట్ బట్టి 15 లేదా 16 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ పై నడుస్తుంది. దీనిలో కమాండింగ్ డ్రైవింగ్ పొజిషన్, 187మి.మి గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. టాటా పంచ్ 1.2-లీటర్ రీవోట్రాన్ ఇంజిన్ డైనా-ప్రో టెక్నాలజీతో వస్తుంది. ఇది 86 పిఎస్ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీని ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. (చదవండి: వారెవ్వా.. అంతరిక్షంలోకి సమంత!)

ఎఎమ్‌టి గేర్ బాక్స్
బురద లేదా తక్కువ ట్రాక్షన్ ఉపరితలాల గుండా సులభంగా డ్రైవింగ్ చేయడం కోసం ఎఎమ్‌టి గేర్ బాక్స్ తో వస్తుంది. ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంపొందించడం కోసం సిగ్నల్స్, ట్రాఫిక్ వద్ద ఇంజిన్ ని ఆటోమేటిక్ గా ఆఫ్ చేయడం కోసం ఐడిల్ స్టార్ట్ స్టాప్, క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్లు ఉన్నాయి. టాటా పంచ్ ఇంటీరియర్స్ చాలా విశాలమైన ఫీల్ ఇచ్చేవిధంగా డిజైన్ చేశారు. డ్యాష్ బోర్డ్ 4 అంగుళాల లేదా 7 అంగుళాల హర్మన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో వస్తుంది. టాటా పంచ్ వెనుక సీట్లు చాలా సౌకర్యవంతమైన అనుభూతిని కలిగిస్తాయి. మైక్రో ఎస్ యువి 366 లీటర్ల బూట్ స్పేస్ తో వస్తుంది.(చదవండి: సెప్టెంబరులో బెస్ట్‌ సెల్లింగ్‌ ఎస్‌యూవీ ఇదే!)

టాటా పంచ్ నాలుగు వేరియెంట్లలో లభ్యం అవుతుంది. ఇందులో రెండు ఎయిర్ బ్యాగులు, ఈబిడితో గల ఎబిఎస్, కార్నర్ సేఫ్టీ కంట్రోల్, ఐసోఫీక్స్, బ్రేక్ స్వే కంట్రోల్ వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. టాటా పంచ్ ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వీటిలో ఓర్కస్ వైట్, అటామిక్ ఆరెంజ్, డేటోనా గ్రే, ఉల్కా కాంస్యం, కాలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్, టోర్నడో బ్లూ ఉన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement