2023 ఏప్రిల్ నెల ఎలక్ట్రిక్ అమ్మకాల్లో 'టాటా మోటార్స్' అగ్రస్థానంలో నిలిచింది. టాప్ 10 కంపెనీల జాబితాలో జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' చివరి స్థానంలో నిలిచింది. గత నెలలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
- ఏప్రిల్ 2023లో టాటా మోటార్ మొత్తం 4,392 యూనిట్ల కార్లను విక్రయించి టాప్ 10లో మొదటి స్థానంలో నిలిచింది. ఇదే నెల గత ఏడాది కంపెనీ అమ్మకాలు 1,817 కావడం గమనార్హం. 2022 కంటే 2023లో ఈ అమ్మకాలు ఏకంగా 141.72 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.
- మహీంద్రా కంపెనీ గత నెలలో 505 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించి జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఈ అమ్మకాలు 2022 ఏప్రిల్ కంటే 3784.62 శాతం ఎక్కువ. అంటే 2022 ఏప్రిల్ నెలలో కంపెనీ మార్కెట్లో కేవలం 13 యూనిట్లను మాత్రమే విక్రయించింది.
- సౌత్ కొరియా బ్రాండ్ అయిన ఎంజి మోటార్ విషయానికి వస్తే, ఇది 2023 ఏప్రిల్ నెలలో 335 యూనిట్లను విక్రయించింది. 2022 ఏప్రిల్ నెలలో ఈ అమ్మకాలు 245 యూనిట్లు. అమ్మకాల పరంగా కంపెనీ మునుపటి ఏడాది కంటే 36.73% ఎక్కువ.
- ఇక ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ గత నెలలో మార్కెట్లో మొత్తం 229 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు కంపెనీ ఎలక్ట్రిక్ విభాగంలో కారుని విడుదల చేయలేదు.
- చైనా బ్రాండ్ అయిన BYD, జర్మన్ బ్రాండ్ అయిన BMW గత నెల అమ్మకాల్లో వరుసగా 154 యూనిట్లు, 60 యూనిట్లను విక్రయించాయి. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో వీటి అమ్మకాలు వరుసగా 21 యూనిట్లు, 17 యూనిట్లు. 2022 అమ్మకాల కంటే 2023లో అమ్మకాలు బాగా వృద్ధి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి.
- 51 యూనిట్ల అమ్మకాలతో హ్యుందాయ్ 7వ స్థానంలో నిలువగా, వోల్వో 8వ స్థానంలో నిలిచింది. వోల్వో కంపెనీ గత నెల అమ్మకాలు 34 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక కియా కంపెనీ 34 యూనిట్ల అమ్మకాలతో ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచింది.
- ఇక చివరగా 10వ స్థానంలో జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ నిలిచింది. 2023 ఏప్రిల్ నెల అమ్మకాలు 27 యూనిట్లు కాగా, 2022 ఏప్రిల్ నెలలో 11 యూనిట్లుగా నమోదయ్యాయి. అమ్మకాల్లో కంపెనీ 145.45 శాతం పెరిగాయి. అయితే మొత్తం అమ్మకాలు 5834 యూనిట్లు (2023 ఏప్రిల్). ఇదే నెల గత ఏడాది అమ్మకాలు 2252 యూనిట్లు మాత్రమే. అంటే అమ్మకాల వృద్ధి 100శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment