
ఆటోమొబైల్ సెక్టార్‌లో దేశంలో రెండో అతి పెద్ద కంపెనీగా ఉన్న హ్యుందాయ్ మార్కెట్‌లో పాగా వేస్తోంది. ఈ సంస్థ నుంచి వస్తున్న మోడల్స్ క్రమంగా మార్కెట్‌లో పాతుకుపోతున్నాయి. ఇప్పటికే క్రెటా మోడల్ అమ్మకాల్లో దుమ్ము లేపుతుండగా ఇప్పుడు దాని సరసన వెన్యూ కూడా చేరింది.
హ్యుందాయ్ వెన్యూ అమ్మకాలు దేశీయంగా మూడు లక్షల మార్క్‌ని క్రాస్ చేశాయి. సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా 2019లో మార్కెట్‌లో రిలీజ్ అయ్యింది వెన్యూ. ఏడాది గడిచేప్పటికే లక్ష కార్ల మైలు రాయిని చేరుకుంది. అయితే తర్వాత ఏడాదికే కరోనా రావడంతో అమ్మకాలు మందగించాయి. కానీ కరోనా ముగిసిన తర్వాత అమ్మకాల్లో వెన్యూ దూసుకుపోతోంది.
కియా వెన్యూ ఈ, ఎస్, ఎస్‌ఎక్స్, ఎస్‌ఎక్స్ (ఓ) వేరియంట్లలో లభిస్తోంది. సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కావడంతో సిటీల్లో తిరగడానికి బయట ప్రయాణాలకు అనుకూలంగా ఉండటం ఈ కార్ల అమ్మకాలు పెరగడానికి దోహాదం చేసింది. వచ్చే నెలలో వెన్యూ అప్‌డేటెడ్ వెర్షన్ మార్కెట్‌లోకి రాబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment