
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ వెన్యూ కొత్త వర్షన్‌ను ప్రవేశపెట్టింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో 1.2 లీటర్ పెట్రోల్ ట్రిమ్ రూ.7.53 లక్షలు, 1.0 లీటర్ టర్బో పెట్రోల్‌తోపాటు డీజిల్ ట్రిమ్స్ రూ.9.99 లక్షల నుంచి ప్రారంభం.
నాలుగు మీటర్లలోపు కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తొలిసారిగా 11 ఫీచర్లను కొత్త వెన్యూకు జోడించారు. డిజైన్, ఇతర అంశాల్లో 40 రకాల మార్పులు చేసినట్టు కంపెనీ తెలిపింది. 60కిపైగా కనెక్టెడ్ ఫీచర్లున్నాయి. వెనుక సీట్లకు రీక్లైనింగ్ ఫంక్షన్, ఆంబియెంట్ నేచుర్ సౌండ్, 12 భాషలు, ఎయిర్ ప్యూరిఫయర్, పవర్ సీట్స్ వంటి హంగులు ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్, వెహికిల్ స్టేటస్ వంటి ఫంక్షన్స్‌ను ఇంటి నుంచే నియంత్రించవచ్చని హుందాయ్ వివరించింది.
చదవండి: సీఎన్‌జీ వాహనాలకు డిమాండ్..
Comments
Please login to add a commentAdd a comment