కార్ల అమ్మకాలు ఈ ఏడాది మే నెలలో 7 శాతం పెరిగాయి. ఈ విషయాన్ని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చ రర్స్ (సియామ్) తెలిపింది. కార్ల విక్రయాలు పెరగడం ఇది వరుసగా ఏడో నెల అని వివరించింది. గత ఏడాది మే నెలలో 1,48,577గా ఉన్న కార్ల అమ్మకాలు ఈ ఏడాది మే నెలలో 1,60,067కు పెరిగాయి.