Maruti Cars Maximum Discounts On Festive Season 2021 - Sakshi
Sakshi News home page

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? తగ్గింపులు ఇవే.. ఇవాళే ఆఖరిరోజు!

Published Sat, Oct 16 2021 12:08 PM | Last Updated on Sat, Oct 16 2021 1:25 PM

These Maruti Cars Maximum Discounts On Festive Season 2021 - Sakshi

పండుగ సీజన్ నడుస్తోంది. కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకునేవాళ్లకు కొన్ని కార్ల కంపెనీలు శుభవార్త సైతం అందించాయి.  కొన్ని కంపెనీ కార్ల కొనుగోలుపై భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే దసరా సీజన్​ ముగియడంతో అక్టోబర్​ 16 వరకే ఆఫర్లు ప్రకటించాయి కంపెనీలు. అవేంటో ఓ లుక్కేద్దాం. 


మారుతీ అల్టో కారుపై రూ.43 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. 

ఎస్ ప్రెసో కారుపై కూడా ఆఫర్ ఉంది. దీనిపై రూ.48 వేల వరకు తగ్గింపు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. 

ఈకో వెహికల్‌పై కూడా తగ్గింపు పొందొచ్చు. రూ.12500 బెనిఫిట్ లభిస్తోంది.

వేగనార్ కారుపై రూ.17500 తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. 

మారుతీ స్విఫ్ట్ కారుపై రూ.24,500 వరకు తగ్గింపు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. 



అదే డిజైర్ కొనుగోలు చేయాలని భావిస్తే.. రూ.19,500 తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. 

వితారా బ్రెజా కారుపై రూ.17,500 తగ్గింపు బెనిఫిట్స్ ఉన్నాయి.

గమనిక: ఆఫర్‌లో కన్సూమర్ ఆఫర్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి కలిసి ఉంటాయి. ఇకపోతే కార్లపై ఆఫర్లు అక్టోబర్ 16 వరకే అందుబాటులో ఉంటాయి. ఇంకా ప్రాంతం, కారు మోడల్, డీలర్‌షిప్ ప్రాతిపదికన డిస్కౌంట్ ఆఫర్లు కూడా మారతాయి. అందువల్ల కారు కొనుగోలు చేయడానికి ముందే ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.

చదవండి: బయ్‌ వన్‌ గెట్‌ వన్‌ ఫ్రీ ! ఈ పాఠం తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement