జాతీయ అంతర్జాతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు దుమ్మురేపుతున్నాయి. రోజుకీ రోజుకీ ఇందన ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్‌వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రపంచ దేశాలకు చెందిన ఆటోమొబైల్ కంపెనీలు పోటీ పడి మరీ కొత్త కొత్త ఫీచర్లు, సరికొత్త డిజైన్లతో కార్లను తయారు చేస్తున్నాయి. వాటిని మార్కెట్‌కి పరిచయం చేస్తున్నాయి.
కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా కార్ల తయారీ సంస్థలు ఈవీ కార్ల తయారీ సంఖ్యను ఏయేటికాయేడు పెంచుకుంటూ పోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈవీ వ‍్యాల్యూమ్ నివేదిక ప్రకారం.. 2021లో ఈవీ కార్ల విభాగంలో తొలి 15 స్థానాల్లో ఉన్న ఆయా కంపెనీల వృద్దిరేట్లు గణనీయంగా పెరిగింది. 2021లో పైన పేర్కొన్నట్లు 15 కంపెనీలు మొత్తం ఏడాది కాలంలో 6.7 మిలియన్ల కార్లను తయారు చేయగా.. వాటి సంఖ్య 2022 తొలిసారి 10 మిలియన్లకు చేరింది.
ఇక కార్ల తయారీ, వృద్దిలో చైనాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ బీవైడీ తొలిస్థానంలో ఉంది. టెస్లా రెండో స్థానంలో కొనసాగుతుండగా.. తొలి 15 సంస్థలు తయారు చేసిన కార్ల వివరాలు ఇలా ఉన్నాయి. వాటిల్లో బీవైడీ 2021లో 598,019 కార్లను తయారు చేయగా.. ఆ సంఖ్య 1,858,364 చేరింది. వృద్ది రేటు 211శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment