కార్లకు శుభకాలం.. టూవీలర్స్కు గడ్డుకాలం
కార్లకు శుభకాలం.. టూవీలర్స్కు గడ్డుకాలం
Published Thu, Feb 9 2017 4:54 PM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM
న్యూఢిల్లీ : డీమానిటైజేషన్ కాలంలో కార్ల విక్రయాలు పెరిగాయని, టూవీలర్స్ అమ్మకాలు తగ్గాయని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్సభకు తెలిపారు. నవంబర్, డిసెంబర్లు చాలా కఠినమైన నెలలని, కానీ డిసెంబర్ నెలలో ప్రత్యక్ష, పరోక్ష పన్నులు విపరీతంగా పెరిగినట్టు అరుణ్ జైట్లీ చెప్పారు. డీమానిటైజేషన్ తర్వాత లక్షల, కోట్ల నగదు, ఆర్బీఐకు తిరిగి వచ్చిందని పేర్కొన్నారు. ఎక్కువ క్యాష్ ఉన్న ఆర్థికవ్యవస్థలో మనం ఉన్నామని, ఇది పన్ను ఎగవేతకు, అవినీతికి, సమాంతర ఆర్థికవ్యవస్థకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.
జీఎస్టీ అమలు తర్వాత దేశంలో మంచి, సమర్థవంతమైన పన్ను వ్యవస్థను రూపొందించవచ్చని అభిప్రాయం వ్యక్తంచేశారు. మౌలిక సదుపాయాలకు రూ.3,96,000 కోట్లను, రైల్వే భద్రతా ఫండ్గా రూ.1,00,000 కోట్లను వెచ్చించినట్టు తెలిపారు. ద్రవ్యోల్బణం టార్గెట్ 4 శాతంగా ఆర్బీఐ నిర్దేశించుకుందని, ప్రస్తుతం మనం 3.6 శాతంలో ఉన్నట్టు లోక్సభలో చెప్పారు.
Advertisement