కార్ల విక్రయాల్లో మారుతీ హవా! | Four Maruti models make it to the top 10 best selling PVs in October | Sakshi
Sakshi News home page

కార్ల విక్రయాల్లో మారుతీ హవా!

Published Mon, Nov 23 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM

కార్ల విక్రయాల్లో మారుతీ హవా!

కార్ల విక్రయాల్లో మారుతీ హవా!

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా అక్టోబర్ అమ్మకాల్లో తన సత్తా  చాటుకుంది. మొదటి 10 అత్యుత్తమ కార్ బ్రాండ్ల అమ్మకాల్లో తొలి నాలుగు స్థానాల్లో మారుతీ మోడళ్లు నిలిచాయి. ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (ఎస్‌ఐఏఎం) విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి.
* వార్షిక ప్రాతిపదికన మారుతీ ఆల్టో అమ్మకాల సంఖ్య అక్టోబర్‌లో 21,443 నుంచి 22,861కి పెరిగింది. మొదటి స్థానంలో నిలిచింది.
* స్విఫ్ట్ డిజైర్ రెండవ స్థానంలో నిలిరచింది.
 
* ప్రిమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ మూడవ స్థానంలో, వేగనార్   నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
* హూందాయ్ ఎలైట్ ఐ20 అమ్మకాలు 11,019.     ఐదవ స్థానంలో నిలిచింది. ఇక గ్రాండ్ ఐ10 ఆరో స్థానంలో ఉంది.
* మహీంద్రా బొలేరో ఏడవ స్థానంలో, హూందాయ్ కొత్త ఎస్‌యూవీ క్రెటా 7,225 యూనిట్ల విక్రయాలతో ఎనిమిదవ స్థానంలో నిలిచింది.
* హోండా సిటీ 7,022 యూనిట్ల విక్రయాలతో 9వ స్థానంలో ఉంది. అమేజ్ 10వ స్థానంలో ఉంది. విక్రయాల సంఖ్య 6,971.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement