
వరుసగా పదో నెలలోనూ పెరిగిన కార్ల విక్రయాలు
న్యూఢిల్లీ: కార్ల విక్రయాలు ఆగస్టులో 6 శాతం పెరిగాయి. కార్ల అమ్మకాలు పెరగడం ఇది వరుసగా పదవ నెల అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) పేర్కొంది. కొత్త మోడళ్ల కారణంగా అమ్మకాలు పుంజుకుంటున్నాయని, వాహన పరిశ్రమ మెల్లమెల్లగా రికవరీ బాట పడుతోందని సియాం డెరైక్టర్ జనరల్ విష్ణు మాధుర్ చెప్పారు. వడ్డీరేట్లు తగ్గితే డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. అయితే ఆగస్టులో మోటార్ సైకిళ్ల అమ్మకాలు 10 శాతం తగ్గాయని, గ్రామీణ మార్కెట్లో డిమాండ్ తగ్గడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.