
న్యూఢిల్లీ: ముందుగా తమ కార్ల అమ్మకాలు, సర్వీసింగ్‌కు అనుమతినిస్తే తప్ప భారత్‌లో తయారీ ప్లాంటు ఏర్పాటు చేయబోమని ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో ఒక యూజర్ వేసిన ప్రశ్నకు ఈ మేరకు స మాధానమిచ్చారు.
‘ముందుగా తన కార్లను అమ్ముకోవడానికి, సర్వీసింగ్ చేయడానికి అను మతి ఇవ్వని ఏ ప్రాం తంలోనూ టెస్లా తన తయా రీ ప్లాంటు ఏర్పాటు చేయదు‘ అని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాం డ్ నెలకొన్న నేపథ్యంలో భారీ భారత మార్కెట్లో తమ కార్లను దిగుమతి చేసుకుని, అమ్మాలని టెస్లా యోచిస్తోంది. అయితే, ఇందుకు ప్రతిబంధకంగా ఉంటున్న భారీ స్థాయి దిగుమతి సుంకాలను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment