అనంతపురం: కియా మధ్యస్థాయి ఎస్‌యూవీ సెల్టోస్ దేశీయంగా ఇప్పటి వరకు 3 లక్షల యూనిట్లు అమ్ముడై కొత్త రికార్డు సృష్టించింది. అలాగే భారత్ నుంచి 1,03,033 యూనిట్లు ఎగుమతి చేసినట్టు కంపెనీ వెల్లడించింది. భారత్‌లో కియా విక్రయాలు మొదలైన నాటి నుంచి దేశంలో 5 లక్షల యూనిట్ల కీలక మైలురాయిని ఇటీవల దాటేసింది. ఇందులో 60 శాతం వాటా సెల్టోస్ కార్లదే కావడం విశేషం.
చదవండి: Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే!
కియా బ్రాండ్ భారతదేశంలోకి ప్రవేశించిన తరువాతి తొలి ప్రొడక్షన్ సెల్టోస్. డిజైన్, ఫీచర్లు, భద్రత, ఇతర అంశాల కారణంగా ఈ కారుకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈసెగ్మెంట్‌లో ఆరు-ఎయిర్‌బ్యాగ్‌లను వేరియంట్‌లలో ప్రామాణికంగా అందిస్తున్న ఏకైక కారు. సెల్టోస్ కియా సెల్టోస్ ఎగుమతి మార్కెట్ కూడా బలంగా ఉంది. ఈ కారు 91 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి అవుతోంది.
చదవండి: ఇన్‌స్టాలో కొత్త అవతార్, స్నాప్‌చాట్‌లో స్పెషల్ ఫీచర్లు
Comments
Please login to add a commentAdd a comment