
కార్ల విక్రయాల్లో స్వల్ప వృద్ధి
• ప్యాసెంజర్ వాహన అమ్మకాలు 4% అప్
• సియామ్ గణాంకాల వెల్లడి
న్యూఢిల్లీ: దేశీ కార్ల విక్రయాలు అక్టోబర్ నెలలో స్వల్ప వృద్ధితో 1,94,158 యూనిట్ల నుంచి 1,95,036 యూనిట్లకు పెరిగారుు. దేశీ ప్యాసెంజర్ వాహన విక్రయాలు 4 శాతం పెరిగారుు. సియామ్ గణాంకాల ప్రకారం.. ప్యాసెంజర్ వాహన అమ్మకాలు గత నెలలో 2,80,766 యూనిట్లుగా నమోదయ్యారుు. గతేడాది ఇదే నెలలో వీటి విక్రయాలు 2,68,630 యూనిట్లుగా ఉన్నారుు. ‘పండుగ సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో కార్ల కంపెనీలు వినియోగదారుల కోసం అధిక స్టాక్‌ను అందుబాటులో ఉంచారుు. అక్టోబర్‌లో ఇలాంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా గత నెలలో కంపెనీల వద్ద ఉన్న స్టాక్‌ను సర్దుబాటు చేశారుు. దీని ఫలితం తాజా విక్రయాలపై కనిపించింది’ అని సియామ్ డెరైక్టర్ జనరల్ విష్ణు మాథుర్ తెలిపారు.
⇔ మారుతీ సుజుకీ కార్ల విక్రయాలు 5 శాతం క్షీణతతో 97,951 యూనిట్ల నుంచి 92,886 యూనిట్లకు తగ్గారుు.
⇔ హ్యుందాయ్ దేశీ కార్ల విక్రయాల్లో 4 శాతం వృద్ధి నమోదరుు్యంది. ఇవి 39,709 యూనిట్ల నుంచి 41,126 యూనిట్లకు పెరిగారుు.
⇔ మహీంద్రా అమ్మకాలు 3 శాతం వృద్ధితో 22,664 యూనిట్ల నుంచి 23,399 యూనిట్లకు ఎగశారుు.
⇔ మొత్తం టూవీలర్ విక్రయాలు 18,00,672 యూనిట్లుగా నమోదయ్యారుు. వార్షిక ప్రాతిపదికన చూస్తే 9 శాతం వృద్ధి నమోదరుు్యంది.
⇔ హీరో మోటొకార్ప్ బైక్ విక్రయాలు 8 శాతం వృద్ధితో 5,21,118 యూనిట్ల నుంచి 5,61,427 యూనిట్లకు పెరిగారుు. దీని స్కూటర్ల అమ్మకాలు 88,790 యూనిట్లుగా ఉన్నారుు.
⇔ బజాజ్ ఆటో మోటార్‌సైకిల్ అమ్మకాలు 5 శాతం ఎగశారుు. ఇవి 2,02,042 యూనిట్ల నుంచి 2,12,997 యూనిట్లకు చేరారుు.
⇔ హోండా బైక్స్ విక్రయాలు 4 శాతం వృద్ధితో 1,67,496 యూనిట్లకు పెరిగారుు. దీని స్కూటర్ల అమ్మకాలు 3,02,862 యూనిట్లుగా ఉన్నారుు.
⇔ వాణిజ్య వాహన విక్రయాలు 11 శాతం వృద్ధితో 65,569 యూనిట్లకు చేరారుు.