వరుసగా 12వ నెలా రయ్.. రయ్..
పాసింజర్ వాహనాలు వరుసగా 12వ నెల కూడా అమ్మకాల్లో దూసుకెళ్లాయి. కార్లు, యుటిలిటీ వెహికిల్స్, వ్యాన్ల అమ్మకాలు జూన్ నెలలో 2.68శాతం పెరిగి 2,23,454 యూనిట్లగా నమోదయ్యాయి. ఇండస్ట్రి బాడీ భారత ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ(సియామ్) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. అయితే కారు విభాగంలో అమ్మకాలు క్షీణించాయి. గత ఏడాది కంటే 5.18శాతం పడిపోయి, 12,54,237 యూనిట్లగా నమోదయ్యాయి. గతేడాది జూన్ లో కార్ల అమ్మకాలు 1,62,655 యూనిట్లగా ఉన్నాయి. మారుతీ సుజుకీ ఇండియా అతిపెద్ద వెండర్స్ లో ఒకటైన సుబ్రోష్ లిమిటెడ్ లో అగ్నిప్రమాదం, మారుతీ ఉత్పత్తులపై ప్రభావం చూపినట్టు సియామ్ నివేదిక పేర్కొంది.
ప్రముఖ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్(ఎస్ యూవీ) ఆరు నెలలో ఐదు నెలలూ పడిపోయి, కార్ల అమ్మకాలపై ప్రబావం చూపాయి. అయితే యుటిలిటీ వాహన అమ్మకాల వృద్ధిని కొనసాగించినట్టు సియామ్ వెల్లడించింది. యుటిలిటీ వాహన అమ్మకాలు 35.24శాతం పెరిగి 55,825 యూనిట్లను నమోదుచేశాయి. గత నెల వాణిజ్య వాహన అమ్మకాలు 5.63శాతం ఎగిసి 56,032 యూనిట్లగా.. టూవీలర్ వాహనాలు 12.26శాతం పెరిగి 14,68,035 యూనిట్లగా రికార్డు అయినట్టు సియామ్ తెలిపింది. స్కూటర్ల అమ్మకాలు 21.32శాతం బలమైన వృద్ధితో 21.32శాతం పెరిగి, 4,49,756 యూనిట్లుగా ఉన్నాయి. అదేవిధంగా మోటార్ సైకిల్స్ 7.52శాతం వృద్ధితో 9,43,680 యూనిట్లుగా నమోదయ్యాయి.