Cricketer Rohit Sharma buys Lamborghini Urus worth INR 3.15 crore, Report Says - Sakshi
Sakshi News home page

Rohit Sharma: అదిరిందయ్యా!! అప్పుడు ఎన్టీఆర్‌.. ఇప్పుడు రోహిత్‌ శర్మ!

Published Wed, Mar 2 2022 12:43 PM | Last Updated on Wed, Mar 2 2022 7:14 PM

Rohit Sharma buys Lamborghini Urus worth INR 3.15 crore - Sakshi

తన కెప్టెన్సీలో వరుస విజయాలతో మాంచి జోరుమీదున్న టీమ్‌ ఇండియా రథ సారధి రోహిత్‌ శర్మ ఖరీదైన లాంబోర్ఘిని ఉరుస్‌ కొనుగోలు చేశాడు. ఇప్పటికే బీఎండబ్ల్యూ ఎం5, టయోటా ఫార్చునర్‌, మెర్సిడెస్‌ జీఎల్‌ఎస్‌ 350డీ, బీఎండబ్ల్యూ5, బీఎండబ్ల్యూ ఎక్స్‌3ని కొనుగోలు చేసిన రోహిత్‌ తాజాగా లాంబోర్ఘినితో.. కాస్ట్లీ కారు కొనుగోలు చేసిన సెలబ్రిటీల సరసన నిలిచారు. 

లంబోర్ఘిని ఉరుస్ ఫీచర్లు 
రోహిత్‌ శర్మ కొనుగోలు చేసిన లంబోర్ఘిని ఉరస్ కారు ప్రస్తుతం టీమిండియా జెర్సీ కలర్‌ లో ఉంటుంది. రూ.3.15కోట్ల విలువైన ఈ కారు ప్రపంచంలో ఫాస్టెస్ట్‌ ఎస్ యూవీలలో ఒకటిగా పేరుంది. 4.4 లీటర్ల టర్బోఛార్జ్‌తో వీ8 ఇంజన్‌తో పనిచేస్తుంది. దీని మోటార్ గరిష్టంగా 641 బీపీహెచ్‌ శక్తిని, 850 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా.. గరిష్టంగా గంటకు 305 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.

టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌.. 
గతేడాది ఆగస్ట్‌లో టాలీవుడ్‌ హీరో,యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అంత్యంత ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ కారును కొనుగులు చేశారు. రణ్‌వీర్‌ సింగ్‌, కార్తిక్‌ ఆర్యన్‌, డైరక్టర్‌ రోహిత్‌ శెట్టీ, రజినీ కాంత్‌ లు సైతం లంబోర్ఘిని ఊరుసును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

చదవండి: ఎన్టీఆర్‌ లంబోర్ఘిని ఊరుస్‌ కారు, దేశంలో తొలి వ్యక్తిగా తారక్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement