సిట్రోయెన్ కంపెనీ దేశీయ విఫణిలో ఆగష్టు 2న 'బసాల్ట్' SUVని లాంచ్ చేయనుంది. అయితే సంస్థ అంత కంటే ముందు ప్రొడక్షన్ వెర్షన్ వెల్లడించింది. ఇది చూడటానికి చాలా మంచి డిజైన్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్త సిట్రోయెన్ బసాల్ట్ కారు 17 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, హాలోజన్ టెయిల్-ల్యాంప్, డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ వంటివి పొందుతుంది. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.2 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టోగుల్ స్విచ్‌లతో కూడిన ఆటో క్లైమేట్ కంట్రోల్, కాంటౌర్డ్ రియర్ హెడ్‌రెస్ట్‌లు మరియు స్టోరేజ్‌తో ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్ వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఈ కారులో సన్‌రూఫ్ లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఎక్కువమంది సన్‌రూఫ్ ఉన్న కార్లనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో సిట్రోయెన్ సన్‌రూఫ్ లేకుండా లాంచ్ చేస్తే.. ఎలాంటి అమ్మకాలను పొందుతుందనేది తెలియాల్సిన విషయం.
బసాల్ట్ కారు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి.. 110 హార్స్ పవర్ మరియు 205 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందనున్నట్లు సమాచారం. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు ప్రారంభ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 12 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment