భారతీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మినీ ఇండియా ఈ నెల ప్రారంభంలోనే తన 'కూపర్ ఎస్, న్యూ జనరేషన్ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్' కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కంపెనీ ఈ రెండు కార్లను జూలై 24న దేశీయ విఫణిలో అధికారికంగా లాంచ్ చేయనుంది.
మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్
కొత్త మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ మంచి డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు రీడిజైన్డ్ హెడ్‌లైట్స్, రివైజ్డ్ టెయిల్‌లైట్స్, 9.5 ఇంచెస్ రౌండ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే మొదలైనవి పొందుతుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటారు 201 Bhp పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 66.45 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ చార్జితో 462 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు ధర రూ. 70 లక్షల వరకు ఉంటుంది. ఇది కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU)గా దిగుమతి అవుతుంది.
మినీ కూపర్ ఎస్
ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న మినీ కూపర్ ఎస్.. మరికొత్త హంగులతో లాంచ్ కానుంది. ఇది రౌండ్ హెడ్‌ల్యాంప్స్, ఇందులో రౌండ్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఫీచర్స్ ఉంటాయి. ఇందులో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 201 Bhp పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా శక్తిని ఫ్రంట్ వీల్స్‌కు పంపుతుంది. ఈ కారు 6.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది. దీని ధర రూ. 42 లక్షల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment