Mini india
-
శారీ.. ఫర్ ఎవర్
నగరం ఓ మినీ ఇండియా. నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్‌తో పాటు మధ్య భారతం, పశి్చమ, వాయువ్య భారతం అంతా కనిపిస్తుంది. నోరు విప్పి మాట్లాడిన తరవాత భాషను బట్టి వారిది ఏ రాష్ట్రమో తెలుస్తుంది. కానీ మహిళల వస్త్రధారణ మౌనంగా మాట్లాడుతుంది. ఇండియన్ ఫ్యాషన్ అవుట్ ఫిట్‌లో చీరది ప్రత్యేకమైన స్థానం. చీరలకు అతి పెద్ద షోకేస్ హైదరాబాద్ నగరం. వెస్టర్న్ ప్యాటర్న్స్ ఎన్ని వచి్చనా వాటిని స్వాగతిస్తూనే ఉంది. పాతికేళ్ల కిందట ఒక టేబుల్ వేసుకుని కాటన్ వస్త్రం మీద అందమైన డిజైన్లను అద్దడంతో చీర కొత్త పుంతలు తొక్కింది. అప్పటి వరకూ చేనేతకారులు తరతరాల సాదా మోడల్స్ దగ్గరే ఉన్నారు. సూరత్‌లోని టెక్స్టైల్ మిల్స్ ఒక డిజైన్ రూపొందిస్తే ఆ డిజైన్‌లో వేలాది చీరలు దేశమంతటా విస్తరించేవి. అలాంటి సమయంలో ఒక చీరకు అద్దిన డిజైన్ మరో చీరలో ఉండకూడదని, వేటికవే వినూత్నంగా ఉండాలని మహిళా డిజైనర్లు చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. ప్రతిదీ యూనిన్గా ఉండాలని కోరుకునే మహిళలకు ఈ ప్రయోగం ఓ వరంలా కనిపించింది. డిజైనర్లు రూపొందించిన డిజైన్లకే పరిమితం కాకుండా సొంత డిజైన్లు గీసి మరీ చేయించుకోవడం మొదలైంది. క్రమంగా అద్దకం ఓ ట్రెండ్ అయ్యింది. చీరను ట్రెండ్ నుంచి పక్కకు పోనివ్వకుండా కాపాడుకుంటూనే ఉంది మెట్రో ఫ్యాషన్. పాతికేళ్లుగా హైదరాబాద్ ఫ్యాషన్ ట్రెండ్‌ని గమనిస్తున్న ప్రముఖ డిజైనర్ గాయత్రి రెడ్డి చెబుతున్న మాట ఇది. నేతలో క్రియేటివిటీ.. చీర మీద అద్దిన డిజైన్ హైలైట్ కావడానికి డిజైన్ అవుట్ లైన్ ఎంబ్రాయిడరీ చేయడం మరో ప్రయోగం. అక్కడి నుంచి మగ్గం వర్క్ మొదలైంది. చీరతోపాటు బ్లౌజ్‌కు ఎంబ్రాయిడరీ, చీర కంటే బ్లౌజ్‌కు పెద్ద ఎంబ్రాయిడరీ, బ్లౌజ్‌కు హైలైట్ కావడానికి ప్లెయిన్ చీర కాంబినేషన్ వంటి ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఇదే సమయంలో మహిళా డిజైనర్లు తమ క్రియేటివిటీని చేనేత వైపు మళ్లించారు. పోచంపల్లి, ఇకత్ నుంచి నారాయణపేట, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి, పాటూరు వంటి నేతలన్నింటికీ ఫ్యాషన్ లుక్ తెచ్చారు. దాంతో ఫ్యాషన్ ప్రపంచాన్ని చేనేత శాసించేంతగా డిజైన్లు పాపులర్ అయ్యాయి. పట్టు చీరల బరువు తగ్గించడంలో విజయవంతమయ్యారు. దాదాపు క్రేప్ మాదిరి తేలిగ్గా ఉంటోందిప్పుడు.వాతావరణం మారింది నగరంలో ఏడాదిలో పది నెలలు చల్లని వాతావరణం ఉండేది. ఈ పాతికేళ్లలో బాగా మార్పులు వచ్చాయి. ఏడాదిలో పది నెలలు వేడిగా ఉంటోంది. వెదర్‌కు అనుకూలంగా ఉండేటట్లు డిజైనర్ శారీస్ కాటన్లో తీసుకురావడం కొత్త తరం మహిళలు చీరపై మోజు పడడానికి ఓ కారణం. చీర కట్టే రోజులు తగ్గినా.. కొనడం మాత్రం తగ్గలేదు. ప్రతి ఫంక్షన్‌కీ ఓ కొత్త చీర కొనే ట్రెండ్ వచ్చేసింది. సాఫ్ట్వేర్ ఉమర్స్ పారీ్టలకు చీరలో మెరిసిపోతున్నారు. రోజూ చుడీదార్ ధరించే వాళ్లు కూడా బర్త్‌డే పార్టీ, గెట్ టు గెదర్ వంటి వాటికి చీర కడుతున్నారు. చీర చుట్టూ ఫ్యాషన్..పాతికేళ్ల క్రితం హైదరాబాద్‌లో నూటికి 70 నుంచి 80 శాతం మహిళలు రోజూ చీరలే ధరించేవారు. క్రమంగా 2015 నాటికి 40 శాతానికి పరిమితమైంది. వర్కింగ్ ఉమెన్స్, డాక్టర్లు, లెక్చరర్లు చీరలతోనే డ్యూటీ చేశారు. ఇప్పుడిది పాతిక శాతం మాత్రమే ఉంది. ఆధునిక వనితల వార్డ్‌రోబ్‌లో చుడీదార్, జీన్స్ డైలీ వేర్ స్థానాన్ని ఆక్రమించాయి. కానీ చీర మాత్రం దూరం కాలేదు. తనను తాను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు ఫ్యాషనబుల్‌గా మారుతోంది చీర. అందుకే శారీఫ్యాషన్ ఎప్పటికీ తెరమరుగు కాదు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
జులై 24న లాంచ్ కానున్న రెండు కార్లు ఇవే!
భారతీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మినీ ఇండియా ఈ నెల ప్రారంభంలోనే తన 'కూపర్ ఎస్, న్యూ జనరేషన్ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్' కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కంపెనీ ఈ రెండు కార్లను జూలై 24న దేశీయ విఫణిలో అధికారికంగా లాంచ్ చేయనుంది.మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్కొత్త మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ మంచి డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు రీడిజైన్డ్ హెడ్‌లైట్స్, రివైజ్డ్ టెయిల్‌లైట్స్, 9.5 ఇంచెస్ రౌండ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే మొదలైనవి పొందుతుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటారు 201 Bhp పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 66.45 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ చార్జితో 462 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు ధర రూ. 70 లక్షల వరకు ఉంటుంది. ఇది కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU)గా దిగుమతి అవుతుంది.మినీ కూపర్ ఎస్ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న మినీ కూపర్ ఎస్.. మరికొత్త హంగులతో లాంచ్ కానుంది. ఇది రౌండ్ హెడ్‌ల్యాంప్స్, ఇందులో రౌండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఫీచర్స్ ఉంటాయి. ఇందులో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 201 Bhp పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా శక్తిని ఫ్రంట్ వీల్స్‌కు పంపుతుంది. ఈ కారు 6.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది. దీని ధర రూ. 42 లక్షల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. -
మినీ ఇండియా.. కృష్ణా
నారాయణపేట జిల్లా సరిహద్దులో ఉన్న కృష్ణాలో విభిన్న సంస్కృతులు, వివిధ ప్రాంతాలు, కులాలు, మతాలు, ఆచార అలవాట్లు, సంస్కృతి, వేషధారణలు ఉన్న వారు నివసిస్తుంటారు. ఇలాంటి వారు ఒకేచోట, ఒకే గ్రామంలో కనిపించడం చాలా అరుదు. ఈ గ్రామంలోని వారంతా వలస వచ్చిన వారే కావడం విశేషం. అందుకే ఈ గ్రామాన్ని ’మినీ ఇండియా’గా అభివర్ణిస్తారు. సాక్షి, కృష్ణా: ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు తమ వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు 1907లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం కృష్ణానదిపై వంతెన నిర్మించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రా నుంచి ఇటువైపు ఉన్న కర్ణాటక, తమిళనాడు వరకు రైలు సౌకర్యం ఏర్పడింది. అదే సమయంలో ఇటువైపు ఉన్న తెలంగాణలోనూ ఓ రైల్వేస్టేషన్ ఉండాలనే తలంపుతో నది పక్కనే ఏర్పాటుచేశారు. జిల్లాలోనే ఈ రైల్వేస్టేషన్ మొదటిది. ఉమ్మడి ఆంధ్రద్రదేశ్‌లో సికింద్రాబాద్ తరువాత రెండో అతిపెద్ద రైల్వేస్టేషన్, బ్రాడ్‌గేజ్ కలిగిన స్టేషన్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో అప్పట్లో ఊరు, ఇళ్లు లేదు. కేవలం రైల్వే ఉద్యోగులు మాత్రమే ఇక్కడ నివసిస్తుండేవారు. వారిలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉండటం, స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, ఉద్యోగ విరమణ తరువాత కూడా ఇక్కడే ఉండటంతో కాలక్రమేణ అది ఓ గ్రామంగా, కృష్ణానది ఒడ్డున ఉండటంతో అది కాస్త కృష్ణా గ్రామంగా మారిందని ఈ ప్రాంత ప్రజలు చెబుతుంటారు. 1911లో హైదరాబాద్ మొదటి తాలుక్దార్ (కలెక్టర్) గోవింద్‌నాయక్ తన భార్య రంగుబాయి జ్ఞాపకార్థం తిరుపతి నుంచి ఓ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి కృష్నానది ఒడ్డున ప్రతిష్ఠించాడు. పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు మహదేవ్ దీక్షిత్, నారాయణభట్, రాఘవేంద్రచారి, గణపతిభట్, భీమాచారి అనే బ్రాహ్మణులను నియమించి వారి భృతి కోసం కొంత భూమిని కేటాయించారు. ఆ కుటుంబాలకు చెందిన వారే ఇప్పుడు వందల సంఖ్యలో ఇక్కడ నివసిస్తూ కర్మకాండలు, నిత్యకర్మ, సావత్రిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీరు నివసించే వీధిని ధర్మశాలగా పిలుస్తున్నారు. కర్మకాండలకు ప్రసిద్ధి చెందిన వాటిలో మొదటిది వారణాసి (కాశి) కాగా రెండోది కృష్నాగా చెప్పవచ్చు. రోజు వివిధ రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో కర్మకాండలు, అస్తికలు, చితాభస్మం నదిలో కలిపేందుకు ఇక్కడకు వస్తుంటారు. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ అస్థికలను కూడా ఇక్కడే నిమజ్జనం చేశారు. జైనులు, రాజ్‌పుత్‌లు, మరాఠాలు.. 70 ఏళ్ల క్రితం జైనులు రాజస్థాన్ నుంచి ఇక్కడకు వ్యాపార నిమిత్తం వలస వచ్చారు. 25 ఏళ్ల క్రితం 100 మంది ఉంటే ఈ రోజు రెండు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ వ్యాపారం పడిపోవటంతో తాము ఇతర రంగాల వైపు వెళ్లాల్సి వచ్చిందని ఆ కుటుంబాలవారు చెబుతున్నారు. రాజ్‌పుత్‌లు మహారాష్ట్ర నుంచి ఇక్కడకు రైల్వే ఉద్యోగులుగా 75 ఏళ్ల క్రితం వచ్చారు. ఒక్క కుటుంబం నుంచి సుమారు 10 కుటుంబాలు అయ్యాయి. 20 ఏళ్ల క్రితం 100కు పైగా ఉండగా ప్రస్తుతం 30 మంది మాత్రమే ఉన్నారు. మరాఠాలు కూడా రైల్వే ఉద్యోగులుగా వచ్చారు. కొందరు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తుండగా మిగిలిన వారు కిళ్లి కొట్టు, సప్లయింగ్ కంపెనీ తదితర వ్యాపారాలు చేస్తున్నారు. అగర్వాల్స్, ముస్లింలు అగర్వాల్స్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి 80 ఏళ్ల క్రితం వ్యాపార నిమిత్తం వచ్చారు. హోటల్స్, స్వీట్ దుకాణాలు, ధాన్యం కొనుగోలు తదితర వ్యాపారం చేసేవారు. 30 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం పడిపోవటంతో ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ముస్లింలు రజకార్ల పాలనలో వ్యాపార నిమిత్తం ఇక్కడకు వచ్చారు. అప్పట్లో సుమారు 800 మంది ఉండగా ప్రస్తుతం 400 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ వ్యాపారం పడిపోవటంతో కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లారని అంటున్నారు. -
'హైదరాబాద్ మినీ ఇండియా'
రాజేంద్రనగర్(హైదరాబాద్): హైదరాబాద్ మిని భారత దేశం అని ఇక్కడి ప్రాంత ప్రజలు అందరిని తమలో కలుపుకోని ఒకే కుటుంబం వలే జీవిస్తారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి తెలిపారు. ఆదివారం బండ్లగూడ గ్రామ మధు పార్కు రైడ్జ్‌లో మంచినీటి పైపులైన్ ప్రారంభోత్సవాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ అన్ని వర్గాల ప్రజలకు అనువుగా ఉందన్నారు. ఎక్కడ లేని విధంగా ఇక్కడి వాతావరణం ప్రజల ఆప్యాయతతో భారత దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు సుఖః సంతోషాలతో జీవిస్తున్నారన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభ్యుతం సహకరిస్తుందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ ఇచ్చి నీటిని అందించేందుకు కృషి చేస్తుందన్నారు. వాటర్ గ్రిడ్ పధకాన్ని విజయ వంతంగా నిర్వహించేందుకు భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తుందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంసృ్కతిక కార్యక్రమాలు విశేషంగా అకట్టుకున్నాయి. పాల్గొన్న అందరికి బహుమతులు అందజేశారు. -
స్వీట్ సిటీ..
ఇది బెంగాలీల మాట మినీ భారత్‌గా పేరుగాంచిన హైదరాబాద్‌తో బెంగాలీలు వందల ఏళ్ల నుంచి అనుబంధం కొనసాగిస్తున్నారు. ఇక్కడ తెలుగు వాళ్లు, బెంగాలీలు అనే తేడాలు ఏమీ లేవు, అందరూ ఇండియన్స్ అనే ఫీలింగ్ మాత్రమే. హైదరాబాదీలు చాలా స్నేహంగా వుంటారు. పొగరు, తలబిరుసుతనం ఇక్కడి వాళ్లలో కనిపించదు. ఇది స్వీట్ సిటీ అని బెంగాలీలు మనస్ఫూర్తిగా చెబుతున్నారు. భాగ్యనగరంతో బెంగాలీల అనుబంధం ఈనాటిది కాదు. నిజాం జమానాలోనే పలువురు బెంగాలీలు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. తెలుగింటి కోడలైన సరోజినీ నాయుడు బెంగాలీనే. ఆమె తండ్రి అఘోరనాథ ఛటోపాధ్యాయ శాస్త్రవేత్త. ఇక్కడ నిజాం కాలేజీని స్థాపించింది ఆయనే. అప్పట్లో ఈస్టిండియా కంపెనీలో, సైన్యంలో, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే పలువురు బెంగాలీలు బదిలీలపై ఇక్కడకు వచ్చారు. వారిలో చాలామంది ఇక్కడే స్థిరపడి, హైదరాబాదీలతో మమేకమైపోయారు. మొదట్లో ఎక్కువ మంది హిమాయత్‌నగర్, దోమల్‌గూడ ప్రాంతాల్లో ఉండేవారు. అప్పట్లో వచ్చిన రైల్వే ఉద్యోగులు చాలామంది తార్నాక వైపు ఉంటున్నారు. ఇక హైదర్‌గూడ, సోమాజిగూడ, అమీర్‌పేట్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కూడా బెంగాలీలు గణనీయంగానే ఉంటున్నారు. ‘హైదరాబాదీలు ఎంతో స్నేహంగా ఉంటారు. చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. పొగరు, తలబిరుసుతనం ఇక్కడి వాళ్లలో కనిపించదు’ అని చాలాకాలంగా ఇక్కడే స్థిరపడ్డ బెంగాలీలు మనస్ఫూర్తిగా చెబుతున్నారు. బెంగాలీలకు, తెలుగు వారికి సాహితీ సంబంధాలు చిరకాలంగా ఉన్న సంగతి తెలిసిందే. రవీంద్రనాథ్ టాగోర్, బంకించంద్ర ఛటర్జీ, శరత్చంద్ర ఛటర్జీల రచనలు తెలుగులోకి విరివిగా అనువాదమయ్యాయి. తీపి లేనిదే తినలేరు... దశాబ్దాలుగా ఇక్కడ ఉంటున్నా, బెంగాలీల ఆహారపు అలవాట్లు మాత్రం పెద్దగా మారలేదు. ఇప్పటికీ వారు తమ సంప్రదాయ వంటకాలనే ఇష్టపడతారు. బెంగాలీలు తమ వంటల్లో చింతపండును దాదాపు వాడనే వాడరు. తీపికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. రసగుల్లా, సందేశ్ వంటి బెంగాలీ స్వీట్లు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంగతి తెలిసిందే. తెలుగువారి మాదిరిగా స్పైసీఫుడ్ను వీరు తినరు. కూరల్లో సైతం కాస్తంత పంచదార లేదా బెల్లం వేసి వండుకునే అలవాటు వారిది. పప్పుల్లో ఐదారు రకాలు వండుతారు. మాంసాహారంలో ముఖ్యంగా చేపలను ఎక్కువగా ఇష్టపడతారు. బెంగాలీలు నాన్‌వెజ్ ఎంతగా తిన్నా, కూరగాయలనూ అదే మోతాదులో తింటారని యాభయ్యేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్న సంఘమిత్ర అన్నారు. సంప్రదాయబద్ధంగా.. పండుగలను, వేడుకలను బెంగాలీలు అత్యంత సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. వినాయక చవితి, దసరా నవరాత్రులు, దీపావళి, బసంత్ పంచమి, జన్మాష్టమి వీరికి ముఖ్యమైన పండుగలు. ఏప్రిల్‌లో వచ్చే మేష సంక్రాంతి బెంగాలీలకు సంవత్సరాది. రాఖీ పండుగకు బదులు సోదరుల కోసం భాయిదూజ్ పండుగను జరుపుకుంటారు. పండుగలలో వీరు కేవలం మట్టి విగ్రహాలనే పూజిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఏమాత్రం వాడరు. పండుగ సమయాల్లో మగవారు ధోవతీ, కుర్తా ధరిస్తారు. చిన్నపిల్లలు సైతం ఇవే దుస్తులు ధరిస్తారు. బెంగాలీల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ లలిత కళల్లో ప్రవేశం ఉంటుంది. విద్యార్థి దశలోనే సంగీతం, చిత్రకళ వంటివి నేర్చుకుంటారు. కట్నాల ప్రసక్తి లేని పెళ్లిళ్లు... బెంగాలీల పెళ్లిళ్లు రాత్రిపూట జరుగుతాయి. పెళ్లి తర్వాత మూడో రోజు వరుడి ఇంట జరిగే విందులో పెళ్లికూతురు స్వయంగా వడ్డన చేస్తుంది. ఐదారు కిలోల చేపలు, చీర, జాకెట్, పసుపు వరుడి ఇంటి నుంచి వధువు ఇంటికి పంపడం ఆనవాయితీ. వాటిని కళాత్మకంగా అలంకరించి మరీ పంపుతారు. అలాగే వరుడి ఇంటికి వధువు తరఫు వారు కూడా కానుకలు పంపుతారు. వీరి పెళ్లిళ్లలో కట్నాల ప్రసక్తి లేకపోవడం విశేషం. ఏడు దశాబ్దాల బెంగాలీ సమితి హైదరాబాద్‌లో బెంగాలీ సమితి ఏడు దశాబ్దాల కిందటే ఏర్పడింది. ఇది 1942లో రిజిస్టర్ అయింది. అయితే, అంతకు ముందు నుంచే ఇక్కడ ఉంటున్న బెంగాలీలు కలసికట్టుగా పండుగలు, వేడుకలు జరుపుకుంటూ వచ్చేవారు. 1950ల నుంచి ఇక్కడ బెంగాలీల దుర్గాపూజ మహోత్సవాలు మొదలయ్యాయి. మా నాన్న 1951లో ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. స్వాతంత్య్రం తర్వాత చాలామంది బెంగాలీలు ఉద్యోగరీత్యా ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. ఇది స్వీట్ సిటీ. - సుమీత్ సేన్, జనరల్ సెక్రటరీ, బెంగాలీ సమితి -
నగరంలో కన్నడిగులు...
మినీ భారత్: ఏళ్ల కిందటే భాగ్యనగరానికి వలస వచ్చిన కన్నడిగులు ఇక్కడి ప్రజలతో మమేకమై జీవనం సాగిస్తున్నారు. ఇడ్లీ, దోశ వంటి తినుబండారాల చిరు వ్యాపారాలు మొదలుకొని ట్రాన్స్పోర్ట్, వస్త్ర వ్యాపారాలు, బంగారు, వెండి ఆభరణాల వంటి బడా వ్యాపారాలు చేస్తున్న వారు కొందరైతే, ప్రైవేటు ఉద్యోగాల్లో కుదురుకున్న వారు ఇంకొందరు. ఉపాధి కోసం ఎలాంటి వృత్తి వ్యాపారాల్లో కొనసాగుతున్నా, కన్నడిగులు తమ సంప్రదాయాలను చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 1972లో భారీ వలసలు... కన్నడిగుల్లో కొందరు నిజాం కాలంలోనే హైదరాబాద్ నగరానికి వలస వచ్చి స్థిరపడ్డారు. అయితే, 1972లో కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా తదితర జిల్లాలతో పాటు సరిహద్దుల్లోని మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో తీవ్రమైన కరువు వాటిల్లినప్పుడు పెద్దసంఖ్యలో కన్నడిగులు నగరానికి వలస వచ్చారు. నగరంలోని గుల్జార్‌హౌస్, చార్‌కమాన్, మామాజుమ్లా పాఠక్, కోకర్‌వాడీ, చేలాపురా, గౌలిపురా, ఛత్రినాక, ఫిసల్‌బండ, బహదూర్‌పురా, జియాగూడ, బేగంబజార్, మిధాని, దిల్సుఖ్నగర్, కాచిగూడ, అత్తాపూర్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. శాకాహారం... శైవాచారం... కన్నడిగుల్లో వీరశైవులు, లింగాయత్‌లు శివలింగానికి పూజచేయడంతో దినచర్య ప్రారంభిస్తారు. జొన్నరొట్టెలు, గోధుమరొట్టెలను ప్రధానంగా స్వీకరించే వీరు పూర్తిగా శాకాహారులు. విందు, వినోదాల్లో సైతం మాంసాహారానికి దూరంగా ఉంటారు. వీరశైవులకు జగద్గురు రేణుకాచార్య కులగురువు కాగా, లింగాయత్‌లకు మహాత్మా బసవేశ్వర కులగురువు. కన్నడిగుల్లో యువతరం ఆధునిక వస్త్రధారణకు అలవాటు పడినా, వయసు మళ్లిన వారు మాత్రం ఇప్పటికీ సంప్రదాయ వస్త్రధారణతోనే తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కన్నడిగుల ప్రత్యేక పండుగ ‘యాడమాస్’ ఉగాది, దసరా, దీపావళి, నాగపంచమి పండుగులను తెలుగువారి మాదిరిగానే జరుపుకొనే కన్నడిగులు, ‘యాడమాస్’ పండుగను ప్రత్యేకంగా జరుపుకొంటారు. పంటలు చేతికొచ్చే సమయంలో జనవరిలో నిర్వహించే ఈ పండుగకు నగరంలోని కన్నడిగులందరూ తప్పనిసరిగా తమ తమ స్వస్థలాలకు వెళతారు. జొన్నరొట్టెలతో పాటు పిండివంటలు చేసుకుని, తమ తమ పొలాలకు వెళ్లి, చేతికొచ్చిన పంటలకు ప్రత్యేక పూజలు చేసి, అక్కడే సామూహికంగా విందుభోజనాలు చేసి, సాయంత్రం ఇళ్లకు చేరుకుంటారు. ఇక లింగాయత్‌లు తమ కులగురువైన మహాత్మా బసవేశ్వర జయంతిని వేడుకగా జరుపుకొంటారు. ఆ సందర్భంగా పతాకావిష్కరణ, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పెళ్లిళ్లలో తలపాగా తప్పనిసరి మర్యాద... కన్నడిగుల పెళ్లిళ్లలో తలపాగా మర్యాద తప్పనిసరి. పెళ్లికి వచ్చిన బంధుమిత్రుల్లో పురుషులందరికీ తప్పనిసరిగా తలపాగా కడతారు. మహిళలందరికీ చీర, పసుపు కుంకుమలు ఇస్తారు. వరుడి ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు వధువు తరఫు బంధుమిత్రులందరికీ ఈ మర్యాదలు చేస్తారు. ఇందులో చిన్నా పెద్దా తారతమ్యాలు ఉండవు. కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించాలి కన్నడిగులను లింగ్విస్టిక్ మైనారిటీలుగా గుర్తించి, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. నగర శివార్లలో మహాత్మా బసవేశ్వర ఆశ్రమ నిర్మాణానికి మూడెకరాల ఖాళీ స్థలాన్ని కేటాయించాలి. నగరంలోని ప్రధాన కూడలిలో బసవేశ్వర శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. కన్నడిగుల కోసం ప్రత్యేక శ్మశానవాటిక స్థలాన్ని కేటాయించాలి. - నాగ్నాథ్ మాశెట్టి, అధ్యక్షుడు, ఏపీ బసవ కేంద్రం,హైదరాబాద్ పిల్లి రాంచందర్