బీజింగ్ మోటార్ షో 2024లో సరికొత్త 'ఫోక్స్‌వ్యాగన్ టైరాన్' అధికారికంగా వెల్లడైంది. చైనా మార్కెట్లో విక్రయానికి రానున్న ఈ కొత్త కారు 5 సీటర్ టైగన్ ఎల్ ప్రో పేరుతో విక్రయానికి రానుంది. ఇది 2025 నాటికి దేశీయ మార్కెట్లో 7 సీటర్ రూపంలో అడుగుపెట్టనుంది.
ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ చూడటానికి చాలా వరకు టైగన్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఇది ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, పెద్ద గ్లాస్‌హౌస్ వంటి వాటిని పొందుతుంది. ఇది దాని ఇతర మోడల్స్ కంటే కూడా కొంత పొడవుగా ఉంటుంది. ఇది సెంటర్ కన్సోల్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్రైవ్ సెలెక్టర్ కోసం రోటరీ డయల్, రెండు కప్‌హోల్డర్‌లతో మంచి లేఅవుట్‌ను పొందుతుంది. వీటితో పాటు 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ADAS ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ రెండు ట్యూన్‌లలో లభిస్తుంది. బేస్ మోడల్ 184 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాప్ వేరియంట్ 217 హార్స్ పవర్, 350 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ గ్లోబల్ మోడల్ అని సీఈఓ థామస్ షాఫర్ వెల్లడించారు. చైనా తరువాత జపాన్, ఆ తరువాత మెక్సికోలో తయారవుతుంది. 2025లో భారతీయ తీరాలను చేరే అవకాశం ఉందని సమాచారం. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన తరువాత జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment