Volkswagen Car
-
బీజింగ్ మోటార్ షోలో అడుగుపెట్టిన ఫోక్స్‌వ్యాగన్ కారు ఇదే..
బీజింగ్ మోటార్ షో 2024లో సరికొత్త 'ఫోక్స్‌వ్యాగన్ టైరాన్' అధికారికంగా వెల్లడైంది. చైనా మార్కెట్లో విక్రయానికి రానున్న ఈ కొత్త కారు 5 సీటర్ టైగన్ ఎల్ ప్రో పేరుతో విక్రయానికి రానుంది. ఇది 2025 నాటికి దేశీయ మార్కెట్లో 7 సీటర్ రూపంలో అడుగుపెట్టనుంది.ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ చూడటానికి చాలా వరకు టైగన్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఇది ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, పెద్ద గ్లాస్‌హౌస్ వంటి వాటిని పొందుతుంది. ఇది దాని ఇతర మోడల్స్ కంటే కూడా కొంత పొడవుగా ఉంటుంది. ఇది సెంటర్ కన్సోల్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్రైవ్ సెలెక్టర్ కోసం రోటరీ డయల్, రెండు కప్హోల్డర్లతో మంచి లేఅవుట్‌ను పొందుతుంది. వీటితో పాటు 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ADAS ఫీచర్స్ కూడా ఉన్నాయి.ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ రెండు ట్యూన్లలో లభిస్తుంది. బేస్ మోడల్ 184 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాప్ వేరియంట్ 217 హార్స్ పవర్, 350 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ గ్లోబల్ మోడల్ అని సీఈఓ థామస్ షాఫర్ వెల్లడించారు. చైనా తరువాత జపాన్, ఆ తరువాత మెక్సికోలో తయారవుతుంది. 2025లో భారతీయ తీరాలను చేరే అవకాశం ఉందని సమాచారం. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన తరువాత జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
అయ్యయ్యో కొత్త కారు, రోడ్డు మీదకి రాకముందే ఇలా! వైరల్ వీడియో
సాధారణంగా చాలా మందికి కారు కొనటం ఒక కల, ఆ కల నిజమయ్యే సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు భారీ నష్టాలను కలిగిస్తాయి. ఇటీవల ఒక వ్యక్తి కారు కొనుగోలు చేసిన కొన్ని నిముషాల్లోనే ప్రమాదానికి గురైంది, దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి డీలర్షిప్ ముందు ఉన్న రోడ్డుపై ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ప్రమాదానికి గురైంది. డెలివరీ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ఎక్కువగా దెబ్బతినింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇందులో కస్టమర్ల తొందర, అత్యుత్సాహం వల్ల జరిగిన పొరపాట్లు స్పష్టంగా తెలుస్తుంది. డ్రైవింగ్ పూర్తిగా నేర్చుకోకుండా కారు నడిపితే ఇలాంగే ఉంటుందనటానికి ఇది మంచి ఉదాహరణ. నిజానికి భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ రూ. 11,21,900 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదలైంది. ఈ సెడాన్ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇది రెండు వేరియంట్స్, రెండు ఇంజిన్ ఆప్సన్షతో అందుబాటులో ఉన్నాయి. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 115 హెచ్‌పి పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తే, 1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 150 హెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా ఈ సెడాన్ లాటిన్ NCAP క్రాస్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొంది దేశీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. -
చిల్లర వ్యాపారం.. చేతినిండా పని!
బీజింగ్ : ఓ మహిళా కస్టమర్ చేసిన పనికి కార్ల షోరూంలో పనిచేసే సిబ్బంది దిమ్మతిరిగిపోయింది. కారు కొనడానికి పెద్ద మొత్తంలో చిల్లర తేవటంతో వాటిని లెక్కపెట్టడానికి.. సిబ్బంది తల్లో ప్రాణం తోకలోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చైనాలోని కాన్‌జౌవ్‌కు చెందిన ఓ మహిళ తను దాచుకున్న డబ్బుతో ఫోక్స్‌వాగన్ కారు కొనాలనుకుంది. ఇందుకోసం తను 10సంత్సరాలుగా దాచుకున్న చిల్లరను 66 ప్లాస్టిక్ సంచుల్లో నింపి కార్ల షోరూంకు తీసుకెళ్లింది. ఫోక్స్‌వాగన్ కారును ఎంచుకున్న తర్వాత డబ్బు చెల్లించాల్సిన సమయంలో ప్లాస్టిక్ సంచుల్ని చూపించింది. దీంతో ఆశ్చర్యపోవటం అక్కడి సిబ్బంది వంతైంది. సంచుల్ని ఒక్కొక్కటిగా విప్పి చిల్లర లెక్కించటానికి.. 17 మంది సిబ్బంది మూడు రోజులు కష్టపడాల్సి వచ్చింది. చిల్లర లెక్కపెట్టిన వారి చేతులు సైతం నల్లగా మారిపోయాయి. పెద్దపెద్ద పెట్టెలలో వాటిని సర్దిపెట్టి భద్రంగా బ్యాంకుకు తరలించారు. చిల్లర లెక్కిస్తున్న దృశ్యాలను వీడియో తీసిన సిబ్బంది దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది. ఇలాంటి సంఘటనే కొద్ది నెలలక్రితం చైనాలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మితిమీరిన వేగం.. వ్యాపారిపై కేసు
బంజారాహిల్స్ (హైదరాబాద్): కారులో 150 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ ఓ యువ వ్యాపారి పోలీసులకు చిక్కాడు. జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి దీపక్వంశీ తన వోక్స్ వ్యాగన్(ఏపీ 13ఏదీ 0045) కారులో ఆదివారం ఉదయం జూబ్లీచెక్‌పోస్టు నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు మితిమీరిన వేగంతో వెళుతుండగా... బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు గమనించారు. కేబీఆర్ పార్కు చౌరస్తాలో కారును నిలిపివేసి స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన కారణంగా దీపక్వంశీపై కేసు నమోదు చేశారు.