సాధారణంగా చాలా మందికి కారు కొనటం ఒక కల, ఆ కల నిజమయ్యే సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు భారీ నష్టాలను కలిగిస్తాయి. ఇటీవల ఒక వ్యక్తి కారు కొనుగోలు చేసిన కొన్ని నిముషాల్లోనే ప్రమాదానికి గురైంది, దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి డీలర్‌షిప్ ముందు ఉన్న రోడ్డుపై ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ప్రమాదానికి గురైంది. డెలివరీ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ఎక్కువగా దెబ్బతినింది.
గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇందులో కస్టమర్ల తొందర, అత్యుత్సాహం వల్ల జరిగిన పొరపాట్లు స్పష్టంగా తెలుస్తుంది. డ్రైవింగ్ పూర్తిగా నేర్చుకోకుండా కారు నడిపితే ఇలాంగే ఉంటుందనటానికి ఇది మంచి ఉదాహరణ.
నిజానికి భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ రూ. 11,21,900 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదలైంది. ఈ సెడాన్ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇది రెండు వేరియంట్స్, రెండు ఇంజిన్ ఆప్సన్షతో అందుబాటులో ఉన్నాయి.
ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 115 హెచ్‌పి పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తే, 1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 150 హెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా ఈ సెడాన్ లాటిన్ NCAP క్రాస్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొంది దేశీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment