త్వరలో అలరించబోతున్న కొత్త కార్లు | Upcoming Cars For 2018 | Sakshi
Sakshi News home page

త్వరలో అలరించబోతున్న కొత్త కార్లు

Published Sat, Aug 25 2018 1:33 PM | Last Updated on Sat, Aug 25 2018 1:50 PM

Upcoming Cars For 2018 - Sakshi

కొత్త కారు అంటే ... ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. మార్కెట్‌లోకి ఎప్పుడు ఏ కొత్త కారు వస్తుందా? అని ఎదురు చూసే ఆటోప్రియులు చాలా మందే. ఈ ఏడాది ఇంకా నాలుగు నెలలే ఉంది. ఆటో ఎక్స్‌ 2018లో చెప్పిన మేరకు ఈ నాలుగు నెలల్లో 11 కార్ల మేర మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే త్వరలోనే ఆటో ప్రియులను అలరించనున్న ఈ కార్లేమిటో ఓ సారి తెలుసుకుందామా?

మెర్సిడెస్‌-బెంజ్‌ సీ-క్లాస్‌ ఫేస్‌లిఫ్ట్‌ : కొత్త ఇంజిన్లతో మెర్సిడెస్‌-బెంజ్‌ సీ-క్లాస్‌ ఫేస్‌లిఫ్ట్‌ ఆటో అభిమానుల ముందకు వస్తుంది. దాంతో పాటు ఎక్స్‌టీరియర్స్‌లో కూడా పలు మార్పులను చేపట్టింది మెర్సిడెస్‌ బెంజ్‌. ఇప్పటికే ఈ వెహికిల్‌ టెస్ట్‌ డ్రైవ్‌ అయిపోయిందట. మొత్తం లగ్జరీ లుక్‌, అద్భుతమైన ప్రదర్శనలో ఇది అభిమానులను అలరించబోతుంది. దీని ధర రూ.42 లక్షల నుంచి రూ.48 లక్షల వరకు ఉంటుంది. 2018 అక్టోబర్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

మెర్సిడెస్‌-బెంజ్‌ ఇ-క్లాస్‌ ఆల్‌-టెర్రైన్‌: ఆటో ఎక్స్‌పోలో సందర్శకుల నుండి ఎక్కువ ఆదరణ లభించిన వాటిలో మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించిన ఇ-క్లాస్ ఆల్ టెర్రైన్ కారు ఒకటి.  మెర్సిడెస్ ఇ-క్లాస్ ఎస్టేట్ వెర్షన్ రివైజ్డ్ వెర్షనే ఈ ఇ-క్లాస్ ఆల్ టెర్రైన్. దీనిని తొలుత 216లో ప్యారిస్ మోటార్ షోలో ఆవిష్కరించారు. దీనిని ప్రస్తుతం మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నారు. దీని ధర రూ.65 లక్షల మేర ఉండొచ్చు. సెప్టెంబర్‌లో ఇది లాంచ్‌ అయ్యే అవకాశాలున్నాయి. 

2018 మారుతీ ఎర్టిగా : ఇది సెవన్‌-సీటర్‌ ఎంపీవీ. ఇది చాలా తేలికగా, చాలా పీచర్లతో వస్తుంది. కొత్త ఇంజిన్లను దీనిలో పొందుపరిచారు. నెక్సా రిటైల్‌ స్టోర్లు వీటిని విక్రయించబోతుంది. దీని ధర రూ.7 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉంటుంది. అక్టోబర్‌లో ఈ వెహికిల్‌ లాంచింగ్‌. 

ఫోర్డ్‌ ఫిగో అండ్‌ ఫోర్డ్‌ యాస్పైర్‌ ఫేస్‌లిఫ్ట్‌ : ఈ ఫిగో సిబ్లింగ్స్‌ అ‍త్యంత శక్తివంతమైన 1.2 లీటరు డ్రాగన్‌ సిరీస్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో మార్కెట్‌లోకి వస్తున్నాయి. అదనపు సేఫ్టీ ఫీచర్లు, పలు వినూత్న ఫీచర్లతో ఇది లాంచ్‌ కాబోతున్నాయి. యాస్పైర్ ఫేస్‌లిఫ్ట్‌ ధర రూ.5.20 లక్షల నుంచి రూ.9 లక్షలుండగా.. ఫిగో ధర రూ.4.80 లక్షల నుంచి రూ.7.80 లక్షలుగా ఉన్నాయి. తొలుత సెప్టెంబర్‌లో యాస్పైర్‌ను లాంచ్‌ చేసి, ఆ అనంతరం ఫిగోను మార్కెట్‌లోకి తేబోతున్నారు.  

మహింద్రా మారాజ్జో : ఎక్కువ స్పేస్‌ కలిగి, ఏడు సీట్లతో రాబోతున్న వెహికిల్‌ మహింద్రా మారాజ్జో. దీని ధర రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉంటుంది. లాంచ్‌ తేదీ : 2018 సెప్టెంబర్‌ 3.

మహింద్రా ఎస్‌201 : సబ్‌-కాపాక్ట్‌ ఎస్‌యూవీ స్పేస్‌లో మరో వాహనం మహింద్రా ఎస్‌201. మారుతీ విటారా బ్రిజా, ఎకోస్పోర్ట్‌, టాటా నెక్సోన్‌కు ఇది డైరెక్ట్‌ పోటీ దారిగా నిలువబోతుంది. దీని ధర రూ.7 లక్షల నుంచి రూ.11 లక్షల మధ్యలో ఉంది. 2018 అక్టోబర్‌లో దీని లాంచింగ్‌.  

2018 హోండా సీఆర్‌-వీ : ఇప్పటికే మార్కెట్లలో ఐదు తరం సీఆర్‌-వీ ఉంది. భారత్‌లో ఏడు సీట్ల అవతార్‌గా రాబోతున్న తొలి వాహనం ఇదే. 9 స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను ఇది కలిగి ఉండబోతుండగా.. తొలిసారి దీని ద్వారా 1.6 లీటర్‌ ఇంజిన్‌ను ప్రవేశపెడుతోంది.

డస్టన్‌ జీఓ, జీవో ప్లస్‌ ఫేస్‌లిఫ్ట్‌ : ఎక్స్‌టీరియర్‌లో స్వల్ప మార్పులతో, లోపల కొత్త ఫీచర్లతో డస్టన్‌ ఈ వాహనాలను తీసుకొస్తోంది. టచ్‌స్క్రీన్‌, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను ఇవి కలిగి ఉంటాయి. దీని ధర రూ.3.50 లక్షల నుంచి రూ.4.80 లక్షల వరకు ఉండబోతున్నాయి. లాంచింగ్‌ : 2018 సెప్టెంబర్‌.

జీప్ కంపాస్ ట్రైల్హాక్ : భారత్‌లో ఇదే అత్యంత ఖరీదైన కంపాస్‌ మోడల్‌. దీని ధర రూ.23 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం. లాంచింగ్‌ : 2018 అక్టోబర్‌. 

నిసాన్‌ కిక్స్‌ : నిసాన్‌ కంపెనీ కిక్స్‌పై భారీ ఆశలే పెట్టుకుంది. టెర్రానో వంటి బ్రో ప్లాట్‌ఫామ్‌ ఆధారితంగా ఈ వెహికిల్‌ లాంచ్‌ చేస్తోంది. దీని ధర రూ.9.90 లక్షల నుంచి రూ.14 లక్షలు ఉంటుందని అంచనా. డిసెంబర్‌లో దీన్ని లాంచ్‌ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

హ్యుందాయ్‌ శాంట్రో : హ్యుందాయ్ శాంట్రో బడ్జెట్ కార్ కస్టమర్ల మదిలో ఇప్పటికీ బెస్ట్ కారుగానే నిలిచింది. భారత్‌లో హ్యుందాయ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన మోడల్ శాంట్రో. ఆశించి ఫలితాలు సాధించడం లేదనే కారణం చేత శాంట్రో కారును విపణి నుండి తొలగించిప్పటికీ దీనికి ఉన్న డిమాండ్ ఇంకా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ తమ శాంట్రో కారును మళ్లీ లాంచ్ చేయడానికి సిద్దమైంది. 2018 అక్టోబర్‌లో ఇది లాంచ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement