న్యూఢిల్లీ: కొత్తగా మార్కెట్‌లోకి వచ్చే నాలుగు చక్రాల వాహనాలకు త్వరలో నంబర్ ప్లేట్లు బిగించి వస్తాయని, వాటికయ్యే ఖర్చును కలుపుకునే వాహనం ధరలు ఉంటాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ‘ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు వాహన తయారీదారులే నంబర్ ప్లేట్లను బిగించి ఇస్తారు.
తర్వాత ప్రత్యేక యంత్రంతో వాటిపై నంబర్‌ను నమోదు చేస్తారు’ అని గడ్కారీ తెలిపారు. ‘తాజా నిర్ణయంతో వినియోగదారులకు ఉపశమనం కలుగుతుంది. అలాగే అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధానం అమలయ్యేందుకు వీలు కలుగుతుంది’అని వివరించారు. అధికారిక రిజిస్ట్రేషన్ నంబర్‌తో కూడిన ప్లేట్లను ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లోని జిల్లా స్థాయి ప్రాంతీయ రవాణా కార్యాలయాలు అందజేస్తున్నాయి. ఒక్కో నంబర్ ప్లేట్‌కు రాష్ట్రాలు వేలల్లో వసూలు చేస్తున్నాయని గడ్కారీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment