Number plates issues
-
‘ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా..!’
ఏ మోటార్ సైకిల్, అయినా, స్కూటర్ అయినా నంబర్ ప్లేట్ ఉండటం సహజం. నంబర్ ప్లేట్ లేకుండా వెళ్తే అది చోరీ చేసిన బైక్‌గా పోలీసులు అనుమానించి, కేసు నమోదు చేయడం పరిపాటి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ పారీ్టపై తెలుగు తమ్ముళ్లు అభిమానం శృతి మించి పాకాన పడింది. నంబర్..గింబర్ జాన్తా నై..అని బైక్‌లపై నంబర్ప్లేట్లు తొలగించేశారు. ఏకంగా పసుపు రంగు ప్లేట్‌పై చంద్రబాబునాయుడు ముఖచిత్రంతో ‘ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా’ అని ప్లేట్ అమర్చి నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నారు.కుప్పం రూరల్: కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు పట్టం కట్టిన తెలుగు తమ్ముళ్లు మోటార్ వాహనాల చట్టం నిబంధనలను తుంగలో తొక్కి, పార్టీ అధినేతపై తమ అభిమానాన్ని కొత్తరీతుల్లో చాటుకునేందుకు ఉబలాటపడుతున్నారు. ద్విచక్ర వాహనాలకు నంబర్లు తొలగించి పెళ్లి పిలుపుల తరహాలో బోర్డులు ఏర్పాటు చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ‘ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా’ అంటు నంబర్ ప్లేట్ స్థానంలో తమదైన ప్లేట్ వేసుకుంటున్నారు. తద్వారా తాము టీడీపీ వీరాభిమానులం అని చూపరుల దృష్టిని ఆకర్షించే యత్నం చేస్తున్నారు. ఇలాంటి పోకడల్ని నిరోధించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ఈ ఒరవడి మరింతగా విస్తరిస్తోంది. వీళ్లను కట్టడి చేసేదెవరు..? నంబర్ లేకుండా ఇలా వెళ్లే మోటార్ సైకిల్ సైక్లిస్టులు ఊహించని విధంగా ప్రమాదాలకు గురైతే పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు తావిస్తోంది. ప్రమాదాలు జరిగితే ద్విచక్ర వాహనాలు అడ్రస్ ఎలా గుర్తిస్తారు? నిబంధనలను అతిక్రమిస్తున్నా వీరికి అపరాధ రుసుం ఎందుకు విధించరు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే నాధుడే లేరు.ఇదేనా బాబు నేర్పన క్రమశిక్షణ?పార్టీలో అందరూ క్రమశిక్షణ పాటించాలని, దానికే మొదటి ప్రాధాన్యత ఇస్తానంటూ పదే పదే సభల్లో ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లకు ఇదేనా నేరి్పన క్రమశిక్షణ అని ‘ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా’ ప్లేట్‌తో వెళ్తున్న బైక్‌లను చూసి విస్తుపోతున్నారు. ఇవి చంద్రబాబు దృష్టికి ఇది వెళ్లకున్నా కనీసం వీటిని చూస్తున్న అధికారులు ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశి్నస్తున్నారు. ఒకవేళ అడ్డుకుంటే తమకే ఇబ్బందులు వస్తాయో అని పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. -
‘ప్లేటు’ మారిందో..వాత పడిందే!
సాక్షి,సిటీబ్యూరో: నగర రోడ్లపై తిరిగే లక్షలాది వాహనాలు.. ప్రతిదానికి నంబర్ ప్లేట్ ఉంటుంది. కానీ అవేవీ ఒకే విధంగా ముఖ్యంగా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండవు. ఆయా నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్షరాలతో ఉంటాయి. అంతేనా.. అంకెలు కూడా చెప్పలేనన్ని వంకర్లతో గుర్తించలేనంతగా ఉంటాయి. ఇటీవల కాలంలో నగరంలోని అనేక వాహనాలకు ఈ తరహా రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లే అధికమైపోయాయి. దీనికి చెక్ పెట్టేందుకు ‘స్పెషల్ డ్రైవ్’ చేపట్టాలని నగర ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించి భారీగా కేసులు సైతం నమోదు చేశారు. ఈ చర్యలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ దృష్టిపెట్టి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం డీసీపీ ఎల్ఎస్ చౌహాన్‌తో కలిసి విస్తృత స్థాయి సమీక్ష సైతం నిర్వహించారు. నంబర్ ప్లేట్లో ఉండే అక్షరాలు, అంకెల ఆకారం, పరిమాణం కచ్చితంగా మోటారు వాహనాల చట్టం (ఎంవీ యాక్ట్)లో నిర్దేశించిన ప్రకారమే ఉండాలి. కానీ ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో ఈ–చలాన్ తప్పించుకోవడం కోసం ట్రాఫిక్ కెమెరాల కళ్లు కప్పడానికి కొందరు వీటిని ఫ్యాన్సీగా ఏర్పాటు చేసుకోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో తప్పుడు నంబర్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. పోలీసులకు సవాల్ విసురుతున్న ‘ఉల్లంఘనులు’ నేరాలు చేయడానికి వాహనాలు వాడే వారు సైతం సక్రమంగా లేని నంబర్ ప్లేట్లు వినియోగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనివల్ల ఉల్లంఘనులు తప్పించుకవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో భద్రతా పరమైన ఇబ్బందులూ తలెత్తుతాయని చెబుతున్నారు. ఈ అంశాలతో పాటు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌పై ‘పోలీసు, ప్రభుత్వ వాహనం, కార్పొరేటర్, ప్రెస్, ఆర్మీ, ఎమ్మెల్యే, ఎంపీ’ ఇలా ఎలాంటి అక్షరాలు, అంశాలు రాయడం కూడా నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్ 50, 51 ఉల్లంఘించడమేనని అధికారులు వివరిస్తున్నారు. తప్పుడు నంబర్ ప్లేట్స్ కలిగి ఉండటం, వాటిలో అంకెలు, అక్షరాల్లో మార్పులు చేయడం వంటి చర్యలకు ఉద్దేశ పూర్వకంగా పాల్పడినట్లు గుర్తిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అక్రమ నంబర్ ప్లేట్ల కారణంగా ఈ–చలాన్ నుంచి తప్పించుకోవడంతో పాటు అసాంఘిక శక్తులు, అనుమానాస్పద వ్యక్తులు, ఉగ్రవాదుల కదలికలు సైతం కనిపెట్టడం కష్టంగా మారిందంటున్నారు. అనేక చోరీ వాహనాలు సైతం స్వేచ్ఛగా నగరంలో తిరుగుతున్నాయని వివరిస్తున్నారు. ఇలాంటి ఉల్లంఘనలు, నేరగాళ్లను గమనించిన ప్రజలు సైతం స్పందించాలని ట్రాఫిక్ అధికారులు కోరుతున్నారు. వాటిని ఫొటో తీసి ట్రాఫిక్ పోలీసు ఫేస్బుక్, ట్విటర్లతో పాటు హెల్ప్‌లైన్ నంబర్ 90102 03626కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉల్లంఘనకు పాల్పడిన వాహనం నంబర్ స్పష్టంగా కనిపించేలా ఫొటో ఉండటంతో పాటు తేదీ, సమయం, ప్రదేశం కచ్చితంగా స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు ఇవే.. ♦ ద్విచక్ర వాహనాలు, తేలికపాటి వాహనాలు, కార్లకు తెల్లరంగు ప్లేటుపై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి. ♦ కమర్షియల్, గూడ్స్ వాహనాలకు పసుపు రంగు ప్లేట్‌పై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి. ♦ నంబర్ ప్లేట్‌పై పేర్లు, బొమ్మలు, సందేశాలు తదితరాలు నిషేధం. ♦ ఎవరైనా బోగస్ నంబర్ ప్లేటు వినియోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఆర్టీఏ అధికా>రుల సహాయంతో డ్రైవింగ్ లైసెన్స్ సైతం రద్దు చేస్తారు. ♦ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్ 200 ఇంటూ 100 మిల్లీ మీటర్లు, తేలికపాటి వాహనాలు, ప్యాసింజర్ కార్లకు 340 ఇంటూ 200 మిల్లీ మీటర్లు లేదా 500 ఇంటూ 120 మిల్లీ మీటర్లు, మీడియం, హెవీ కమర్షియల్ వాహనాలకు 340 ఇంటూ 200 మిల్లీ మీటర్ల సైజుల్లో ఉండాలి. నంబర్ ప్లేట్ ఉల్లంఘనకుసంబంధించి 2017 నుంచినమోదు చేసిన కేసులు ఇవీ.. 2017 36,632 2018 71,324 2019 17,486 (మార్చి) -
నంబర్ ప్లేట్లతోపాటే కొత్త కార్లు: గడ్కారీ
న్యూఢిల్లీ: కొత్తగా మార్కెట్లోకి వచ్చే నాలుగు చక్రాల వాహనాలకు త్వరలో నంబర్ ప్లేట్లు బిగించి వస్తాయని, వాటికయ్యే ఖర్చును కలుపుకునే వాహనం ధరలు ఉంటాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ‘ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు వాహన తయారీదారులే నంబర్ ప్లేట్లను బిగించి ఇస్తారు. తర్వాత ప్రత్యేక యంత్రంతో వాటిపై నంబర్‌ను నమోదు చేస్తారు’ అని గడ్కారీ తెలిపారు. ‘తాజా నిర్ణయంతో వినియోగదారులకు ఉపశమనం కలుగుతుంది. అలాగే అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధానం అమలయ్యేందుకు వీలు కలుగుతుంది’అని వివరించారు. అధికారిక రిజిస్ట్రేషన్ నంబర్‌తో కూడిన ప్లేట్లను ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లోని జిల్లా స్థాయి ప్రాంతీయ రవాణా కార్యాలయాలు అందజేస్తున్నాయి. ఒక్కో నంబర్ ప్లేట్‌కు రాష్ట్రాలు వేలల్లో వసూలు చేస్తున్నాయని గడ్కారీ పేర్కొన్నారు. -
నంబర్ ప్లేట్స్ వివాదానికి తెరదించిన కేసీఆర్!
హైదరాబాద్: తెలంగాణలో మోటార్ వాహనాల నంబర్ ప్లేట్ల మార్పు వివాదానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు తెరదించారు. వాహన నంబర్ ప్లేట్ల అంశంపై రవాణాశాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణలో వాహనాల నంబర్లు నంబర్ ప్లేట్లు మార్చాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. AP స్థానంలో TSగా మార్చుకుంటే సరిపోతుందని కేసీఆర్ తెలిపారు. వాహనాల నంబర్లు పాతవే ఉంటాయని, జిల్లా కోడ్ మాత్రమే మారుతుందని కేసీఆర్ అన్నారు. వాహనాల నెంబర్ ప్లేట్లపై రవాణాశాఖ మంత్రికి సరిగ్గా వివరించలేకపోవడంవల్లే సమస్య వచ్చిందని సమీక్షా సమావేశంలో అధికారులతో కేసీఆర్ అన్నట్టు తెలిసింది.