ద్విచక్ర వాహనాలపై నంబర్ లేని ప్లేట్లు!
తెలుగు తమ్ముళ్ల రూటే వేరు
కుప్పంలో ఇదో కొత్త ఒరవడి
చోద్యం చూస్తున్నఅధికారులు
ఏ మోటార్ సైకిల్, అయినా, స్కూటర్ అయినా నంబర్ ప్లేట్ ఉండటం సహజం. నంబర్ ప్లేట్ లేకుండా వెళ్తే అది చోరీ చేసిన బైక్‌గా పోలీసులు అనుమానించి, కేసు నమోదు చేయడం పరిపాటి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ పారీ్టపై తెలుగు తమ్ముళ్లు అభిమానం శృతి మించి పాకాన పడింది. నంబర్..గింబర్ జాన్తా నై..అని బైక్‌లపై నంబర్‌ప్లేట్లు తొలగించేశారు. ఏకంగా పసుపు రంగు ప్లేట్‌పై చంద్రబాబునాయుడు ముఖచిత్రంతో ‘ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా’ అని ప్లేట్ అమర్చి నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నారు.
కుప్పం రూరల్: కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు పట్టం కట్టిన తెలుగు తమ్ముళ్లు మోటార్ వాహనాల చట్టం నిబంధనలను తుంగలో తొక్కి, పార్టీ అధినేతపై తమ అభిమానాన్ని కొత్తరీతుల్లో చాటుకునేందుకు ఉబలాటపడుతున్నారు. ద్విచక్ర వాహనాలకు నంబర్లు తొలగించి పెళ్లి పిలుపుల తరహాలో బోర్డులు ఏర్పాటు చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ‘ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా’ అంటు నంబర్ ప్లేట్ స్థానంలో తమదైన ప్లేట్ వేసుకుంటున్నారు. తద్వారా తాము టీడీపీ వీరాభిమానులం అని చూపరుల దృష్టిని ఆకర్షించే యత్నం చేస్తున్నారు. ఇలాంటి పోకడల్ని నిరోధించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ఈ ఒరవడి మరింతగా విస్తరిస్తోంది.
వీళ్లను కట్టడి చేసేదెవరు..?
నంబర్ లేకుండా ఇలా వెళ్లే మోటార్ సైకిల్ సైక్లిస్టులు ఊహించని విధంగా ప్రమాదాలకు గురైతే పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు తావిస్తోంది. ప్రమాదాలు జరిగితే ద్విచక్ర వాహనాలు అడ్రస్ ఎలా గుర్తిస్తారు? నిబంధనలను అతిక్రమిస్తున్నా వీరికి అపరాధ రుసుం ఎందుకు విధించరు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే నాధుడే లేరు.
ఇదేనా బాబు నేర్పన క్రమశిక్షణ?
పార్టీలో అందరూ క్రమశిక్షణ పాటించాలని, దానికే మొదటి ప్రాధాన్యత ఇస్తానంటూ పదే పదే సభల్లో ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లకు ఇదేనా నేరి్పన క్రమశిక్షణ అని ‘ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా’ ప్లేట్‌తో వెళ్తున్న బైక్‌లను చూసి విస్తుపోతున్నారు. ఇవి చంద్రబాబు దృష్టికి ఇది వెళ్లకున్నా కనీసం వీటిని చూస్తున్న అధికారులు ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశి్నస్తున్నారు. ఒకవేళ అడ్డుకుంటే తమకే ఇబ్బందులు వస్తాయో అని పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment