సరికొత్త ఫీచర్లతో మహీంద్రా ఆల్ ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ400 ప్రో రేంజ్‌ను మహీంద్ర అండ్ మహీంద్ర లిమిటెడ్ ఇటీవల విడుదల చేసింది. మహీంద్రా ఎక్స్‌యూవీ400కి అప్‌డేటెడ్ వెర్షన్‌గా తీసుకొచ్చిన దీని ప్రారంభ ధర రూ. 15.49 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ ప్రకటించింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ప్రో రేంజ్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి ఈసీ ప్రో (EC Pro), రెండు ఈఎల్ ప్రో (EL Pro) వర్షన్లు. మార్పుల విషయానికొస్తే, కొత్త వెర్షన్‌ల క్యాబిన్ రీడిజైన్ చేసిన డాష్‌బోర్డ్‌తో కొత్త బ్లాక్ అండ్ గ్రే ట్రీట్‌మెంట్‌తో వస్తోంది.
కొత్త ఫీచర్ల విషయానికి వస్తే, టాప్-స్పెక్ ఈఎల్ ప్రో వేరియంట్‌లో ఫ్లోటింగ్ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రివైజ్డ్ ఎయిర్‌కాన్ ప్యానెల్, రియర్ టైప్-సీ USB ఉన్నాయి. పోర్ట్, వెనుక మొబైల్ హోల్డర్, కొత్త ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ప్రో రేంజ్‌లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో 34.5kWh బ్యాటరీ ప్యాక్ ఒక్క సారి చార్జ్ చేస్తే 375 కిమీల డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుందని, 39.4kWh యూనిట్ 456కిమీల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వీటికి బుకింగ్స్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం కాగా ఫిబ్రవరి 1 నుంచి డెలివరీలను కూడా కంపెనీ ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment