జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా తన హెక్టర్ లైనప్‌ను విస్తరించడంతో భాగంగా.. ఒకేసారి రెండు కొత్త 7 సీటర్ వేరియంట్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో ఒకటి హెక్టర్ ప్లస్ 7 సీటర్ 'సెలెక్ట్ ప్రో' కాగా, మరొకటి 'స్మార్ట్ ప్రో'. ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ.19.71 లక్షలు, రూ.20.64 లక్షలు.
హెక్టర్ ప్లస్ 7 సీటర్ సెలెక్ట్ ప్రో వేరియంట్ 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. స్మార్ట్ ప్రో వేరియంట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. కాబట్టి ఇవి రెండూ కూడా ఉత్తమ పనితీరును అందిస్తాయని భావిస్తున్నాము.
ఎంజీ హెక్టర్ కొత్త వేరియంట్లు వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఐ-స్మార్ట్ టెక్నాలజీతో కూడిన 14 ఇంచెస్ పోర్ట్రెయిట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఈ కారులో సుమారు 75 కంటే ఎక్కువ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నట్లు సమాచారం.
ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఫ్లోటింగ్ టర్న్ ఇండికేటర్‌లు, ఎల్ఈడీ బ్లేడ్-స్టైల్ కనెక్టెడ్ టెయిల్ లాంప్, 18 ఇంచెస్ డ్యూయెల్ టోన్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్ వంటివి పొందిన కొత్త ఎంజీ హెక్టర్ ప్లస్ లెథెరెట్ సీట్లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటివి కూడా కలిగి ఉంటుంది.
ఇదీ చదవండి: వచ్చేసింది కొత్త మారుతి డిజైర్: ధర రూ.6.79 లక్షలు మాత్రమే..
లేటెస్ట్ డిజైన్ కలిగిన ఎంజీ హెక్టర్ ప్లస్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, హిల్ హోల్డ్ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్ వంటి అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ ఇప్పుడు ఈ రెండు వేరియంట్లకు ఎంజీ షీల్డ్ ప్రోగ్రామ్ కింద.. 3 సంవత్సరాల వారంటీ, 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 3 సంవత్సరాల లేబర్ ఫ్రీ పీరియాడిక్ సర్వీస్ వంటి వాటిని కూడా అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment