Mahindra Thar.e unveiled: Check features and details - Sakshi
Sakshi News home page

అదిరిపోయే లుక్‌లో మహీంద్ర థార్‌ ఎలక్ట్రిక్ వెర్షన్‌

Published Fri, Aug 18 2023 10:22 AM | Last Updated on Fri, Aug 18 2023 1:51 PM

Mahindra Thare unveiled check features and all - Sakshi

Mahindra Thar.e మహీంద్రా  అండ్‌ మహీంద్ర పాపులర్‌ ఎస్‌యూవీ థార్ ఎలక్ట్రిక్ ఆఫ్-రోడర్‌ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చేస్తోంది. 'థార్-ఇ' పేరుతో రూపొందించిన ఈ ఎలక్ట్రిక్‌ కారు ఫస్ట్‌ లుక్‌ను దక్షిణాఫ్రికాలో జరిగిన ఫ్యూచర్‌స్కేప్ ఈవెంట్‌లో మహీంద్ర రివీల్‌ చేసింది.

అదిరిపోయే మిలిటరీ-గ్రేడ్ లుక్, ఫీచర్స్‌తో సరికొత్తగా భారీ క్రేజ్ సంపాదిస్తోంది. దీని ఫీచర్స్‌ స్పెషాలిటీస్, లుక్  మాత్రం ప్రస్తుత థార్‌కి  భిన్నంగా  బాక్సీ లుక్‌లో చాలా స్టయిలిష్‌గా ఉంది. 'థార్-ఇ' ఆకట్టుకంటోంది. ఈ వెహికల్‌లో 400 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందించే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ని అమర్చనుంది. INGLO ప్లాట్‌ఫారమ్‌ ఎలక్ట్రిక్ రేంజ్ పరంగా చాలా అనుకూలంగా ఉండనుదని భావిస్తున్నారు. 

హార్డ్‌కోర్ ఆఫ్-రోడర్ కి అనుకూలంగా ఆల్ వీల్ డ్రైవ్, డబుల్ మోటార్ లేఅవుట్‌తో వస్తుంది.కొత్త LED లైటింగ్ ఎలిమెంట్స్, గ్రిల్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఫ్రంట్‌ అండ్‌ రియర్‌ ప్రొఫైల్‌లు గ్రే-కలర్ స్కిడ్ ప్లేట్స్‌ ఇచ్చింది. ఇంటీరియర్‌  ఫీచర్లను పరిశీలిస్తే.. అద్భుతమైన టచ్‌స్క్రీన్ కోసం రెండు స్క్రీన్‌లను అందిస్తోంది. థార్-ఇ ఉత్పత్తిని 2026లో తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.   ఇక ధర విషయానికి వస్తే 20-25 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement