మహీంద్రా థార్‌తో సాహసం.. వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహింద్రా | Mahindra Thar Easily Crosses River Drowns After Flash Floods | Sakshi
Sakshi News home page

Anand Mahindra: కప్ప లాగా ఏరు దాటిన మహీంద్రా థార్.. వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహింద్రా

Published Wed, Sep 15 2021 8:55 PM | Last Updated on Thu, Sep 16 2021 11:29 AM

Mahindra Thar Easily Crosses River Drowns After Flash Floods - Sakshi

ఆటోమొబైల్‌ దిగ్గజ కంపెనీ మహీంద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. ఆలోచనాత్మక పోస్ట్‌లతో అభిమానులు, ఫాలోవర్లను అలరించడం ఆనంద్‌ మహీంద్రాకు ఇష్టం. ఇటీవల గుజరాత్‌లో కురిసన భారీ వర్షాలకు రాజ్‌కోట్‌ సిటీ వరద నీటితో మునిగిపోయింది. ఊరా లేదా చెరువా అన్నట్టుగా అంతా నీటిమయం అయ్యింది. అయితే, ఆ సమయంలో పోలీసులు ఉన్న మహీంద్రా బొలెరో వాహనం భారీ వరద నీటిలో పడవలగా ఆ కోన నుంచి ఈ కోనకు వెళ్ళింది. అయితే ఈ వీడియోను వేరే వ్యక్తి షేర్ చేయడంతో దానిని ఆనంద్ మహీంద్రా చూసి ఆశ్చర్యపోయారు.

తాజాగా నేడు అలాంటి మరో వాహనం వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో మహీంద్రా థార్ వాహనం చాలా వేగంతో ప్రవహిస్తున్న ఒక ఏరును ఈ కోన నుంచి ఆ కొనకి, ఆ కొన నుంచి ఈ కొనకు దాటింది. ఈ వీడియోను షేర్ చేస్తూ..  "గుజరాత్‌లో వరద నీటిలో నడిచిన బొలెరో వాహనం గురించి నేను ట్వీట్ చేసిన తర్వాత మీలో చాలా మంది అలాంటి వీడియోలను షేర్ చేస్తున్నారు. అవి @YouTubeలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక నుంచి మహీంద్రా కంపెనీ కప్ప లాగా ఉభయచర వాహనా( MAM)లను మేము తయారు చేయాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను" అని అన్నారు.(చదవండి: Viral Video: ఆనంద్‌ మహీంద్రా ఆశ్చర్యపోయిన వేళ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement