సాక్షి,ముంబై: టాటా నానో అండ్ మహీంద్రా థార్ రెండూ ఢీ కొట్టుకుంటే ఏది గెలుస్తుందని అడిగితే అందరూ థార్ గెలుస్తుందని ముక్తకంఠంతో చెబుతారు. అయితే ఇటీవల జరిగిన ఒక సంఘటనలో నానో దెబ్బకు మహీంద్రా థార్ బోల్తా పడింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో మహీంద్రా థార్ పూర్తిగా బోల్తా పడి ఎక్కువ డ్యామేజీకి గురైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అయితేచిత్రం ఏమిటంటే ఇందులో టాటా నానోకి పెద్దగా ప్రమాదం జరగలేదు, కేవలం ఫ్రంట్ బంపర్ మాత్రం కొద్దిగా దెబ్బతినింది. ఈ సంఘటన థార్ యజమానుల గుండెల్లో గుబులు రేపుతోందట.
నిజానికి మహీంద్రా థార్ అధిక వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో టాటా నానో ఢీ కొట్టినట్లు సామజిక వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు, కానీ నానో కారు ఢీ కొడితే థార్ ఎలా బోల్తా పడింది అనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది.
గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఉత్తమ సేఫ్టీ రేటింగ్ పొందిన మహీంద్రా థార్ ఇప్పటికి కూడా దేశీయ మార్కెట్లో అత్యంత ఎక్కువ అమ్మకాలు పొందుతున్న SUVలలో ఒకటిగా ఉంది. అదే సమయంలో క్రాష్ టెస్ట్‌లో నానో సున్నా స్టార్ రేటింగ్ మాత్రమే పొందడం గమనార్హం.
మహీంద్రా థార్ అధిక వేగం కారణంగానే బోల్తా పది ఉండవచ్చు, లేదా ఇతర కారణాలు ఉండవచ్చు. ఈ సంఘటన వల్ల థార్ ప్రియులు ఏ మాత్రం దిగులుపడాల్సిన అవసరం లేదు. ఈ SUV లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment